E-Paper
Advertisement

ఉద్యోగం పేరుతో నమ్మించి రిసార్ట్ కు తీసుకెళ్లి… ఘట్కేసర్‌లో దారుణం!

ఉద్యోగం పేరుతో నమ్మించి రిసార్ట్ కు తీసుకెళ్లి… ఘట్కేసర్‌లో దారుణం!
Advertisement

Ghatkesar: ఉద్యోగం ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసే ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ పరిధిలో ఓ మహిళపై ఉద్యోగం ఎరగా వేసి దారుణానికి ఒడిగట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

మున్సిపల్ ఉద్యోగం పేరిట వల

Advertisement

మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని జగన్మోహన్ అనే వ్యక్తి ఒక మహిళను నమ్మించాడు. ఉద్యోగం రావాలంటే ఉన్నతాధికారికి లంచం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి, రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు విడతల వారీగా రూ.4.50 లక్షలు సమర్పించుకుంది.

రిసార్ట్‌కు తీసుకెళ్లి దారుణం

Advertisement

అనంతరం, ఉన్నతాధికారిని కలవాలని చెప్పి మల్లాపూర్ నుంచి బాధితురాలిని కారులో భువనగిరి వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో అవుషాపూర్ వద్ద ఉన్న ఒక రిసార్ట్‌లో అధికారి ఉన్నాడని నమ్మించి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ బాధితురాలిపై భయాందోళనలు సృష్టించి బెదిరింపులకు గురిచేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు.

హైవేపై పడేసి పరారీ.. నిందితుడి అరెస్ట్

దారుణం జరిగిన తర్వాత వరంగల్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ఆమెను కారులో నుంచి బయటకు తోసేసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘోరం నుంచి కోలుకున్న బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, రంగంలోకి దిగి నిందితుడు జగన్మోహన్‌ను వెంటాడి అరెస్టు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: బండ్లగూడలో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి!

Tags

Related News

బండ్లగూడలో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి!

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

కేటీఆర్‌,హరీష్ రావు ఇద్దరివి దిమాక్ లేని మాటలు: ఎంపీ చామల ఫైర్!

నేడు హైడ్రా కు 42 ఫిర్యాదులు.. వీటిలో ఎక్కువ సమస్యలు ఇవే..?

నేను రాజీనామా చేస్తా.. నువ్వు చేస్తావా ఉత్తమ్.. హరీష్ రావు సవాల్!

బోడుప్పల్‌లో ఫేక్ డాక్టర్ల దందాకు చెక్.. రిజిస్ట్రేషన్ లేని మమత క్లినిక్ సీజ్!

ఫామ్‌హౌస్‌లో యువకుడి అనుమానాస్పద మృతి!

Big Stories

Advertisement
×