E-Paper
Advertisement

పెట్రోల్‌పై ప్రత్యేక పన్ను విధింపు, నేటి నుంచి అమల్లోకి, అంతా మన మంచికే

పెట్రోల్‌పై ప్రత్యేక పన్ను విధింపు, నేటి నుంచి అమల్లోకి, అంతా మన మంచికే
Advertisement

Tax Hiked On Petrol: పశ్చిమాసియాలో పరిస్థితుల సాధారణ స్థాయికి చేరడంతో కేంద్రప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పెట్రోల్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతులపై ప్రత్యేక పన్ను విధించింది. జూలై ఒకటి అనగా నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.

పెట్రోల్‌పై ప్రత్యేక పన్ను విధింపు.. నేటి నుంచి అమల్లోకి

Advertisement

పశ్చిమాసియా ఉద్రిక్తతలు నార్మల్ స్థితికి చేరింది. జలసంధి ద్వారా నౌక రాకపోకలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దేశీయ అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంధన ఎగుమతులపై నియంత్రణ కొనసాగించేందుకు విండ్‌ఫాల్ గెయిన్స్ టాక్స్‌లో మార్పులు చేసింది. ఈ మేరకు తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఆర్థికశాఖ. ఈ నిర్ణయాలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి.

కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం పెట్రోల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించింది. లీటరుకు రూ.1.50 నుంచి రూ.4 కు పెంచింది. భారత్ నుంచి వివిధ విదేశాలకు పెట్రోల్ ఎగుమతి చేస్తే చమురు కంపెనీలు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ సరఫరాను తగ్గించి విదేశాలకు ఎగుమతులు చేయకుండా అడ్డుకోవడం దీని వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు అంటున్నారు.

Advertisement

దేశీయంగా వాహనదారులపై ఎలాంటి భారం పడదు

అదే సమయంలో మరొక నిర్ణయం తీసుకుంది. డీజిల్, విమాన ఇంధన ఎగుమతుల విషయంలో చమురు శుద్ధి సంస్థలకు ఊరట ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను సమీక్షించిన ఆర్థికశాఖ, డీజిల్‌పై ఉన్న ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.14 నుంచి రూ.8.50కు కుదించింది.

విమానాల ఇంధనం ఏటీఎఫ్‌పై ఉన్న పన్నును రూ.12.50 నుంచి రూ.7.50కు తగ్గించింది. భారత రిఫైనరీలు ఎగుమతులకు రిలీఫ్ ఇచ్చింది. దీనివల్ల రిఫైనరీలకు లాభదాయక పరిస్థితులు ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో దేశీయంగా విక్రయించే పెట్రోల్-డీజిల్ విషయంలో క్లారిటీ ఇచ్చింది.

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. సిలిండర్ల ధర రూ.183.50 తగ్గింపు, నేటి నుంచి అమల్లోకి

ప్రస్తుతం ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వాహనదారులు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకు ఆయిల్ కొనుగోలు చేయవచ్చు. పన్ను పెంపు, తగ్గింపు అనేది కేవలం ఎగుమతులకే మాత్రమే. దేశీయ వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది కేంద్రప్రభుత్వం.

Related News

రేషన్‌ కార్డు‌దారులకు బిగ్ అలర్ట్.. కోటిన్నర కార్డులు రద్దు? 6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

Big Stories

Advertisement
×