E-Paper
Advertisement

గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. సిలిండర్ల ధర రూ.183 తగ్గింపు, నేటి నుంచి అమల్లోకి

గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..  సిలిండర్ల ధర రూ.183 తగ్గింపు, నేటి నుంచి అమల్లోకి
Advertisement

LPG Cylinder Price Reduced: ఎట్టకేలకు జూలై ఒకటి నుంచి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా మరొక శుభవార్త. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను భారీగా తగ్గింది. తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్

Advertisement

పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో మాదిరిగా హోర్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలు రాకపోకలు మొదలయ్యాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

దేశంలో గ్యాస్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. జులై ఒకటి నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి గ్యాస్ కంపెనీలు. మార్చి తర్వాత కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి.

Advertisement

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర భారీగా తగ్గింపు, నేటి నుంచి అమల్లోకి

కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ధర తగ్గింపుతో బ్రేక్ పడిందని చెప్పవచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల ఇంకా తగ్గవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మే నెలలో కమర్షియల్ సిలిండర్ రూ. 993 పెరిగింది. జూన్ ఒకటిన మరో రూ. 42 పెరగడంతో దీని ధర రూ. 3,113.50 లకు చేరింది.

తాజాగా ధర తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,930కి చేరింది. కోల్‌కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ. 3,255.50 నుండి రూ. 3,081.50 లకు తగ్గింది. కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. గతంలో సిలిండర్ల ధర పెరిగినట్టు రేట్లు అమాంతంగా పెంచేశాయి.

ALSO READ: కేతన్ మర్డర్ ఎఫెక్ట్.. లోహగఢ్‌కు పోటెత్తిన పర్యాటకులు.. క్రైమ్ స్పాటే టార్గెట్!

మరి ఇప్పుడు ఆయా ధరలు తగ్గిస్తాయా? అన్నదే సామాన్యుడి ప్రశ్న. గృహ వినియోగ సిలిండర్ ధర మార్పు లేదు. రూ. 942 ధర యథాతధంగా కొనసాగుతోంది. గృహ వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు ఏడాది తర్వాత మార్చి 7న రూ. 60 పెంచాయి గ్యాస్ కంపెనీలు. జూన్ 7న మరో రూ. 29 పెంచాయి.

Related News

ఇండియన్ ఆయిల్ కంపెనీలో జాబ్స్.. రూ.1.60 లక్షల వరకు జీతం.. ఫ్రెషర్లకు మంచి అవకాశం

రూపాయికి ఇన్ని వస్తువులా? స్వాతంత్ర్యం నాటి నిత్యావసరాల ధరలు చూస్తే షాకవుతారు!

ఆగస్టు 15న కాదు.. ఆ రెండు ఆలయాల్లో 4 రోజుల ముందే స్వాతంత్ర వేడుకలు.. కారణం తెలిస్తే షాకే?

ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్‌లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!

బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు.. జెన్ జీ నిరసనలు తప్పవంటూ, అవినీతి 90 శాతం ఇంటర్వ్యూల్లో

‘నా దగ్గర బాంబు ఉంది’.. ప్రయాణికుడి వ్యాఖ్యతో.. విమానాశ్రయంలో రచ్చ రచ్చ!

ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష హాట్ టాపిక్.. విజయ్ ప్రభుత్వం టాప్ ప్రయార్టీ

Big Stories

Advertisement
×