BigTV English

Terrorists: ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Terrorists: ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Terrorists: ఉగ్రవాదులపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామని అన్నారు. లేకుంటే నేరుగా నరకానికే పంపిస్తామని హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.


కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులను జైలుకు పంపుతాం అని అన్నారు. లేకుంటే నరకానికే పంపిస్తాం అని హెచ్చరించారు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేస్తామని తెలిపారు. అంతే కాకుండా జమ్ము కశ్మీర్‌లో గత కొద్ది రోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు.

అదే విధంగా జమ్మూ కశ్మీర్‌లో గత కొద్దిరోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. ఈ దాడుల్లో కొందరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని మంత్రి వివరించారు. 2019లో ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హిల్ స్టేట్ లో భద్రతా బలగాలు దాదాపు 900 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా మంత్రి ఈ సందర్భంగా మండిపడ్డారు. 2004-2014 లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూకాశ్మీర్‌లో 7217 ఉగ్రవాదులు ఘటనలు జరిగాయని మంత్రి తెలిపారు ఆ దాడుల్లో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 67 శాతానికి తగ్గిందని అన్నారు.


Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×