BigTV English

Thalapathy Vijay: దళపతి విజయ్ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు

Thalapathy Vijay: దళపతి విజయ్ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు

Election Commission registers Tamilaga Vettri Kazhagam: తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కి కేంద్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. దళపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను ఎన్నికల కమిషన్ అధికారికంగా గుర్తించింది. ఈ విషయాన్ని టీవీకే పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నిర్ణయంపై విజయ్‌తో పాటు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


‘తమిళగ వెట్రి కళగం‘ను రాజకీయ పార్టీగా నమోదు చేయాలని మేము గత ఫిబ్రవరి 2వ తేదీన భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాము. మన దేశ ఎన్నికల సంఘం దీనిని చట్టబద్ధంగా పరిగణించి ఇప్పుడు మన పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసి, రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు అనుమతించింది. దీన్ని మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని విజయ్ చెప్పారు.

కాగా, 2026 ఎన్నికల లక్ష్యంగా తాను తన పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచి విజయ్ పై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో విజయ్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నారు.


రాజకీయ ప్రయాణంలో అనేక సమస్యలు ఎదురవుతాయని, ఎన్ని విమర్శలు ఎదురైన చిరునవ్వుతో ఎదుర్కోవాలని విజయ్ చెప్పారు. ఎవరిపైనా పోరాటం చేయాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపైనే పోరాటం చేయాలని విజయ్ చెప్పిన మాటలు ఇంకా ప్రజల్లో ఉండడం విశేషం. తన పొలిటికల్ పార్టీ దేనికోసం పనిచేయాలనే క్లారిటీ విజయ్ కి ఉండడంతో రెస్పాన్స్ బాగా వస్తోంది.

Also Read: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

ఇదిలా ఉండగా, చెన్నై శివారు పనైయూర్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ జెండాలో పైన, కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి. మధ్యలో ఎరుపురంగు వృత్తాకారం లోపల శిరీష పుష్పం, చుట్టూ నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో ఐదు నీలం, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి. శిరీష పుష్పానికి రెండు వైపులా ఘీంకరించే ఏనుగు రూపాలు ఉన్నాయి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×