BigTV English

Marriage : పెళ్లి రోజే ఎగ్జామ్ రాసిన వధువు .. వీడియో వైరల్..

Marriage : పెళ్లి రోజే ఎగ్జామ్ రాసిన వధువు .. వీడియో వైరల్..

Marriage : ఆ యువతి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంది. తన వివాహం చేసుకోవాల్సిన రోజే ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. దీంతో నవ వధువుగా ముస్తాబై వెళ్లి మరీ పరీక్ష రాసింది. ఇప్పుడు ఆ వధువు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కేరళకు చెందిన శ్రీలక్ష్మి అనిల్‌ బేథనీ నవజీవన్‌ కళాశాలలో ఫిజియోథెరపీ చదువుతోంది. ఇంతలో కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. సరిగ్గా పెళ్లి రోజు ఓ ఎగ్జామ్ వచ్చి పడింది. దీంతో పెళ్లి కూతురుగా ముస్తాబై కళాశాలకు వెళ్లింది. ఉత్సాహంగా వెళ్లి ఎంతో ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసింది.

ఆ యువతి కుటుంబ సభ్యులు, వరుడి కుటుంబం ఆమెను ప్రోత్సహించారు. పట్టుచీర ధరించి , ధగధగ మెరిసే నగలు వేసుకుని కళాశాలలో అడుగుపెట్టింది. ల్యాబ్ కోటు ధరించి పరీక్ష హాలులో వెళ్లింది. ప్రశాంతంగా పరీక్ష రాసింది. ఇప్పుడు ఆ వధువు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త పెళ్లికూతురుకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. చదువుకు పెళ్లి ఆటంకం కాదని ఈ యువతి నిరూపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలకు శ్రీలక్ష్మి స్ఫూర్తిగా నిలుస్తోందని అంటున్నారు. ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×