BigTV English

Wrestlers : బ్రిజ్‌ భూషణ్ అరెస్టుకు రెజ్లర్ల పట్టు.. చర్చలకు కేంద్రం మరోసారి ఆహ్వానం..

Wrestlers : బ్రిజ్‌ భూషణ్ అరెస్టుకు రెజ్లర్ల పట్టు.. చర్చలకు కేంద్రం మరోసారి ఆహ్వానం..


Wrestlers : బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం చేస్తున్న రెజ్లర్లను మరోసారి కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. ఇటీవల అమిత్ షా వారితో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి కీలక పరిణామాలు జరిగాయి. స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. అమిత్ షాతో భేటీ జరిగిన రెండు రోజులకే రెజ్లర్లు విధులు చేరడంతో ఉద్యమం ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.

ఈ ఇష్యూపై స్పందించిన సాక్షిక్ మాలిక్ పోరాటం ఆపేదని లేదని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం విధుల్లో చేరినా ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అమిత్ షాతో భేటీపై బజరంగ్ పునియా మాట్లాడారు. కేంద్రమంత్రితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. ఈ ఉద్యమం ఆగదని ప్రకటించారు. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వ్యూహరచన చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ స్పందనతో తాము సంతృప్తిగా లేమని పునియా తేల్చిచెప్పారు.


బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ రంగంలోకి దిగారు. వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ విజ్ఞప్తిపై రెజ్లర్లు స్పందించారు. తమ పోరాటాన్ని ఆపేది లేదన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్‌ చేయాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. కేంద్రం విజ్ఞప్తిపై కాప్‌ పంచాయత్‌లో చర్చిస్తామన్నారు. రూమ్‌ల్లో కాదు.. బహిరంగంగా చర్చించాలని రెజ్లర్ల కోరుతున్నారు.

Related News

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

Big Stories

×