India Lowers Flag to Half Mast: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి సహా.. 9 మంది మరణించడం విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మృతిపై భారత్ సంతాపం తెలిపింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జాతీయ జెండాను సగం మాస్ట్ కు దించి.. ఒక రోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. న్యూ ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ కూడా తమ జెండాను అవనతం చేసింది.
ఆదివారం సాయంత్రమే ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు వార్తలు రాగా.. ఆయన ప్రమాదంలో మరణించారని సోమవారం తెల్లవారుజామున ఆ దేశ మీడియా, అధికారులు ప్రకటించారు. ఇబ్రహీం రైసీ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. భారతదేశం-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో రైసీ సహకారాన్ని మరచిపోలేమని X వేదికగా ట్వీట్ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రెసిడెంట్ డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. భారత్ ఇరాన్ కు అండగా నిలుస్తుందని తెలిపారు.
Also Read: ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరయ్యారంటే..?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, వారి ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ లోని డిజ్ మార్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఇరాన్ అధ్యక్షుడు అజర్ బైజాన్ పర్యటన అనంతరం ఇరాన్ కు ఇబ్రహీం రైసీ తిరిగి వస్తుండగా ప్రతికూల వాతావరణంలో అతని హెలికాప్టర్ కూలిపోయింది.
#WATCH | Delhi: National flag at Rashtrapati Bhavan flies at half-mast as one-day national mourning is being observed in the country following the death of Iranian President Ebrahim Raisi, Foreign Minister and other high-ranking officials in a helicopter crash. pic.twitter.com/xZZXGiCdpv
— ANI (@ANI) May 21, 2024