BigTV English

Ebrahim Raisi Death: ఇరాన్ అధ్యక్షుడు మృతి.. సంతాపాలు సరే.. సంబరాల సంగతేంటి..?

Ebrahim Raisi Death: ఇరాన్ అధ్యక్షుడు మృతి.. సంతాపాలు సరే.. సంబరాల సంగతేంటి..?

అసలేం జరిగిందో సింపుల్ గా కట్టే కొట్టే తెచ్చే విధానంలో ఓ సారి చెప్పుకుందాం. ఇరాన్-అజర్ బైజాన్ బార్డర్ లో కిజ్ కలాసీ, భోదావరిన్ అనే రెండు డ్యామ్ లను నిర్మించారు. ఈ డ్యామ్ లను రెండు దేశాలు కలిసి నిర్మించాయి. వీటిని అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్లొల్లహియస్.. మరికొందరు కలిసి ప్రారంభించారు. వీటిని ప్రారంభించి తిరిగి ఇరాన్ కు బయల్దేరారు. జోల్ఫా ఏరియా వరకు వచ్చేవరకు అంతా బాగానే ఉంది. బట్.. ఆ ఏరియాలోకి వచ్చాకే సీన్ మారిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఏటీసీతో లింక్ కట్ అయ్యింది. వీరి హెలికాప్టర్ ను ఫాలో అవుతున్న మరో రెండు హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యాయి. కానీ వీరి హెలికాప్టర్ మాత్రం కుప్ప కూలింది. అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయితే ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే.. నో సరైవర్స్.. అందరూ చనిపోయారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్.. ప్రపంచ దేశాల సంతాపాలు అన్ని జరిగిపోయాయి.

అయితే ఇరాన్ పూర్తిగా ఇది యాక్సిడెంటల్ గా జరిగిందని నమ్మడం లేదు. బయటికి ప్రతికూల వాతావరణం అని స్టేట్ మెంట్ ఇచ్చారు ఆ దేశ అధికారులు. బట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అధ్యక్షుడి హెలికాప్టర్ ను ఫాలో అవుతున్న మరో రెండు హెలికాప్టర్లు సేఫ్ గా ల్యాండ్ అయ్యాయి. అధ్యక్షుడి హెలికాప్టర్ మాత్రమే క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చూపులన్ని రెండు దేశాలవైపే మళ్లాయి. ఆ దేశాలు ఇ్రజాయెల్ అండ్ అమెరికా ఈ రెండు దేశాలతో ఇరాన్ శత్రుత్వం ఇప్పటిది కాదు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వైరం అంతా ఇంతా కాదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్.. ఇరాన్‌లో ఇజ్రాయెల్ చేసిన కోవర్ట్ ఆపరేషన్స్ అన్నీ ఇన్నీ కాదు. ఇన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టే ప్రస్తుతం ఈ రెండు దేశాలవైపే ఇరాన్ అనుమానంగా చూస్తోంది.


Also Read: కిర్గిస్తాన్ లో ఆగని హింస.. మళ్లీ పెరిగిన దాడులు

సరే ఇదంతా ఓకే.. ఓ దేశ అధ్యక్షుడు మరణించాడంటే చాలా మంది బాధపడతారు. గుక్కపెట్టి ఏడ్వకపోయినా.. కనీసం అయ్యో అనైనా అనుకుంటారు. కానీ ఇరాన్‌లో కొందరు మాత్రం రైసీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొందరైతే మొదటిసారి ఓ హెలికాప్టర్ ప్రమాదంలో బాధితులు జీవించి ఉండొద్దని ప్రార్థనలు చేశారు.. అంటూ ట్వీట్ చేశారు. మరికొందరు హ్యాపీ హెలికాప్టర్ డే అంటూ ట్వీట్ చేశారు. విదేశాల్లోని ఇరాన్ కాన్సులేట్ల ముందు డ్యాన్సులు చేస్తూ కొందరు కనిపించారు. ఇక ఇరాన్‌లో కొందరు బాణాసంచా పేల్చి సెలబ్రేట్ చేసుకునే వాళ్లు కూడా కనిపించారు.

ప్రస్తుతం ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేనీ.. ఆ పోజిషన్‌కు కావాల్సిన అన్నీ అర్హతలు ఉన్న వ్యక్తి రైసీ.. చాలా రోజులుగా ఆయనే కాబోయే సుప్రీమ్ అన్న ప్రచారం కూడా ఉంది. మరి అలాంటి వ్యక్తి మరణిస్తే సంబరాలు చేసుకోవడం ఏంటనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్.. ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు నుంచే ఇరాన్‌లో చాలా క్రూరంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అది మరింత పీక్స్‌ చేరింది. రైసీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రైసీ ఇస్లామిక్ ఆచారాలను ఆచరించే విషయంలో చాలా క్రూరంగా వ్యవహరించారు.

Also Read: Trump film ‘The Apprentice’ controversy: ట్రంప్‌కు సినిమా ఎఫెక్ట్, ఆపై..

ఇరాన్‌లో ఫ్రీ స్పీచ్‌పై ఉక్కుపాదం మోపారు. హిజాబ్‌కు సంబంధించి కఠినమైన రూల్స్ పెట్టారు. మోరాలిటీ పోలీస్‌ను ఏర్పాటు చేయడం.. ఇస్లామ్‌ విధానాలను అనుసరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం. ఇవీ ఆయనపై ఉన్న ఆరోపణలు.. ఇక 2022లో హిజాబ్ ధరించలేదని అరెస్టై ఆ తర్వాత పోలీస్ కస్టడీలో మృతి చెందిన మాషా అమినీ ఇష్యూ ఇరాన్‌లో మాత్రమే కాదు.. అనేక ముస్లిం కంట్రీస్‌లో ప్రకంపనలు సృష్టించింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత.. ఆ దేశం ఎదుర్కొన్న అత్యంత సంక్షోభ సమయాల్లో ఇది ఒకటి.. 1988లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చిక్కిన యుద్ధ ఖైదీలను ఉరి తీయించాడు రైసీ.. దాదాపు 5 వేల మందిని నిర్దాక్షిణ్యంగా ఉరి తీశారు. ఇలాంటి దారుణాలన్ని తన ట్రాక్ రికార్డ్‌లో ఉన్నాయి కాబట్టే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందన్న ప్రచారం ఉంది.

ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి రైసీ డెత్.. ఆ తర్వాత పరిణామాలే రుజువు అంటున్నారు అనలిస్ట్‌లు.. ఎందుకంటే ఇరాన్‌లో చాలా మంది మత ఆచారాలను పాటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రైసీ మృతితో ఇక ఈ అరాచక పాలనకు చెక్ పెట్టాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. మరి ఈ మరణం.. ఇరాన్‌లో మరో రెవల్యూషన్‌కు దారి తీస్తుందా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Also Read: Manisha koirala meets PM Rishi sunak: పీఎం రిషి సునాక్‌తో నటి మనీషా, అందుకోసమేనట

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×