BigTV English
Advertisement

Shocking Video: కచోరి షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

Shocking Video: కచోరి షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు


Shocking Video: ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ కచోరి సమోసా వాలా షాపులోకి బెంజ్ కారు అమాంతం దూసుకొచ్చింది. ఈ ఘటన ఢిల్లీలోని కాశ్మీరి గేట్ ఏరియాలో గల ఫటేహ్ కచోరి షాపులో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన విష్యూవల్స్ అక్కడి సీసీటీవీ కామెరాలో రికార్డ్ అయ్యాయి. ఎప్పటి లాగే కచోరి షాపులోని సిబ్బంది తమ పనులు చేసుకుంటున్నారు. షాపుకు వచ్చిన కస్టమర్లకు కచోరీలు, సమోసాలు, టీలు అందిస్తూ యధావిథిగా బిజినెస్ నడిపిస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ ఎస్‌యూవీ కారు షాపులోకి దూసుకొచ్చింది. దీంతో ప్రశాంత వాతావరణంలో హ్యాపీగా కచోరీలు తింటున్న కస్టమర్లు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షాపు ముందు ఉన్న నిలబడి తింటున్న వ్యక్తులు, టేబుల్స్‌తో సహా తోసుకుంటూ షాపులోకి ఆ కారు దూసుకెళ్లింది. కారు తమ మీదకు దూసుకురావడాన్ని గమనించిన కొంతమంది అక్కడి నుండి పరుగులు తీసి జాగ్రత్త పడ్డారు. కారు దూసుకువచ్చి గోడకు ఢీ కొట్టింది. దీంతో పలువురు తమ కుటుంబ సభ్యులు కారు కింద పడిపోయారనే ఆందోళనతో ఓ వ్యక్తి తన భార్య కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ తరుణంలో కారు ఆమెను షాపులోకి తోసుకెళ్లింది కాబట్టి నెమ్మదిగా అందులో నుంచి బయటకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు.


Also Read: హే ప్రభూ.. బార్బీలా మారాలనుకుని.. చివరికి జాంబీలా తయారైందేంటి

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు నడిపిన వ్యక్తి నోయిడాకు చెందిన 36 ఏళ్ల పరాగ్ అనే లాయర్‌గా గుర్తించారు. పరాగ్‌తో పాటు ఆయన భార్య కూడా ఆ కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం వారు పారిపోలేదని.. పోలీసులు వెళ్లే సరికి అక్కడే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎస్ యూవీ కారును సీజ్ చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా పరాగ్‌కు నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో తాను తాగలేదని పోలీసులు నిర్ధారించారు.

Tags

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×