BBC: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ముంభై, ఢిల్లీలో ఉన్న కార్యాలయాల్లో దాదాపు 50 గంటలుగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి అధికారులు సోదాలు జరుపుతున్నారు. కార్యాలయాల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే హెచ్ఆర్, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పలువురు అధికారులతో ఐటీ అధికారులు మాట్లాడుతున్నారు.
సర్వేలో భాగంగా 10 మంది ఉన్నత స్థాయి అధికారులు మంగళవారం నుంచి ఇళ్లకు వెళ్లకుండా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా సిబ్బంది మంగళవారమే ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే బీబీసీ ప్రసారాలకు మాత్రం ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు. ప్రసార సేవలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి.