BigTV English

Dog: ఐదో అంతస్తు నుంచి పడ్డ కుక్క.. బాలిక దుర్మరణం

Dog: ఐదో అంతస్తు నుంచి పడ్డ కుక్క.. బాలిక దుర్మరణం

Pet Dog: మహారాష్ట్రలో ఓ మనసు కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపాప రోడ్డుపై నడుస్తూ వెళ్లుతున్నది. తల్లి వెంట ఆ బిజీ రోడ్డుపై అన్ని గమనిస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది. ఇంతలో పై నుంచి ఓ కుక్క వచ్చి నేరుగా బాలికపై పడింది. బాలిక నేలను కరుచుకుపడిపోయింది. స్పృహ కోల్పోయింది. తల్లి వెంటనే బాలికను తన చేతుల్లోకి తీసుకుంది. కానీ, బాలికలో కదలిక లేదు. వెంటనే సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించింది. ఈ ఘటన థానే జిల్లా ముంబ్రలో చోటుచేసుకుంది.


ముంబ్రలోని అమృత్ నగర్లో మూడేళ్ల బాలిక తల్లితో రద్దీగా ఉన్న రోడ్డుపై నడుస్తూ వెళ్లుతున్నది. చిరాగ్ మేషన్ బిల్డింగ్ పై నుంచి కుక్క పడింది. చిరాగ్ మేషన్ టెర్రస్ పై సయ్యద్ తన పెంపుడు కుక్కతో ఉన్నది. ఆ కుక్క సయ్యద్ చేతిలో నుంచి జారి నేరుగా రోడ్డుపై నడుస్తున్న బాలికపై పడింది. అంత బరువు పడటంతో మూడేళ్ల బాలిక కూలబడిపోయింది. ఈ ఘటన మొత్తం ఎదురుగా ఉన్న ఓ బిల్డింగ్‌లోని ఓ సీసీటీవీ కెమెరాకు చిక్కింది.

Also Read: వినేష్ ఫొగాట్ అనర్హత.. స్పందించిన బ్రిజ్ భూషణ్ కుమారుడు


పోలీసులకు ఈ విషయం తెలిసింది. ముంబ్ర పోలీసు స్టేషన్‌లో ఆకస్మిక మరణంగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన హృదయవిదారకంగా ఉన్నది. చాలా మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలా మంది విషాదాన్ని వ్యక్తం చేశారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×