BigTV English

Tomato Bouncers: ఆ వార్తపై పీటీఐ క్షమాపణలు.. ఎందుకంటే?

Tomato Bouncers: ఆ వార్తపై పీటీఐ క్షమాపణలు.. ఎందుకంటే?

Tomato Bouncers: ఆ వార్తపై పీటీఐ క్షమాపణలు.. ఎందుకంటే?దేశవ్యాప్తంగా టమాటా రచ్చ మామూలుగా లేదు. టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. టమాటాలపై వార్తా కథనాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వ్యవహరమే ప్రముఖ వార్తాసంస్థ పీటీఐకి చిక్కులు తెచ్చి పెట్టింది. చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.


చాలా చోట్ల టమాటాలు చోరీకి గురికావడం…పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో వారణాసిలో ఓ టమాటా వ్యాపారి బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు పీటీఐ కథనం ప్రసారం చేసింది. అయితే ఆ వార్త తప్పని తేలడంతో పీటీఐ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ఆ వార్త పూర్తిగా అబద్ధమని తెలిపింది. క్షమాపణలు చేప్తూ ట్వీట్‌ చేసింది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని హామీ ఇస్తూ ట్వీట్ చేసింది. నిజనిర్ధారణ చేయడంలో విఫలమైనట్లు వెల్లడించింది.

కాగా దేశంలో టమాట ధర కిలో 140 నుంచి 160 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో టమాటాలపై చాలా కథనాలు,మీమ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×