BigTV English

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Top 10 Richest Indian states in 2024: ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదలైంది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది. 42.67 లక్షల కోట్ల రూపాయల జిడిఎస్‌పి (GDSP) అంచనా ప్రకారం మహారాష్ట్ర తలసరి స్థూల దేశీయోత్పత్తిలో 13.30 పర్సెంట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే జిడిపి(GDP) తలసరి ఆదాయంలో మాత్రం తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో తలసరి ఆదాయం 3.83 లక్షల రూపాయలుగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం కావడం విశేషం.


ఇక తలసరి ఆదాయం(GDP) పరంగా చూస్తే.. తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. అటు జిడిపి లో కూడా 31.55 లక్షల కోట్లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచి జాతీయ జిడిపిలో 8.90 వాటాను దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో కర్ణాటక 28.09 లక్షల కోట్ల జిడిఎస్‌పి(GDSP) నమోదు చేసింది. తలసరి ఆదాయం విషయానికి వస్తే 3.31 లక్షల రూపాయలు నమోదు చేసింది. ఇది జాతీయ జిడిపి(GDP) లో 8.20 శాతంగా నిలిచింది.

Also Read: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..


కర్ణాటక తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ వరుసగా నిలిచాయి. మహారాష్ట్ర ఫస్ట్ నుంచే బాలీవుడ్‌కు కేంద్రంగా వ్యవహరించడం.. బడా పారీశ్రామిక వేత్తలకు కేరాఫ్‌గా ఉండటంతో తొలి స్థానంలో నిలిచింది. ఇక మరోవైపు 2030-37 ఆర్ధిక సంవత్సరం నాటికి దేశ తలసరి ఆదాయం రెండింతలు పెరగవచ్చని ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్(S&P Global Market Intelligence) అంచనా వేసింది. 7 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని తెలిపింది. వార్షిక వృద్ధి రేటు మాత్రం 6.7 శాతంగా కొనసాగుతుందని వెల్లడించింది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×