Tamil Nadu : దక్షిణ తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . భారీ వర్షాల కారణంగా తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి , తెన్‌కాశి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు , ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం డిసెంబర్ 18న సెలవు ప్రకటించింది. డిసెంబర్ 19న కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
వర్షాల కారణంగా తిరునెల్వేలి వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు నుంచి కేరళకు వెళ్లే రైళ్లు నిలిపివేయడంతో అయ్యప్పస్వామి భక్తులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. కొల్లం నుంచి మధురై వెళ్లే రైలులో 630 మంది ప్రయాణికులు ,రామేశ్వరం వెళ్లే రైలులో 740 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రభుత్వం 25కి పైగా బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపే చర్యలు చేపట్టింది.