Tamilnadu: ప్రేమకు కులం.. మతం.. జాతి భేదం లేదంటారు. ఇప్పుడు లింగ భేదం లేదని నిరూపించింది ఈ జంట. ఆరేళ్లు ప్రేమించిన ట్రాన్స్‌జెండర్, తాను కోరుకున్న ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. వివాహం బంధంతో వారిద్దరి ఒక్కటయ్యారు. కుటుంబసభ్యుల ఆమోదంతో ఈ జంట ఒక్కటైంది. ఈ వ్యవహారం తమిళనాడులోని వెలుగు చూసింది.
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ పెళ్లికి వేదికైంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ట్రాన్స్‌జెండర్ పేరు సంజన. ఈమె సొంతూరు కడలూరు జిల్లా. స్వంతగా ఈమె నర్తకి కూడా. ఈ క్రమంలో ప్రేమలో పడింది ఆమె. ఆరేళ్లుపాటు నాగరాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతడు దేవాలయంలోని పూజారిగా పని చేస్తున్నాడు.
ఈ పెళ్లికి తొలుత ఇరు కుటుంబాలు అడ్డుజెప్పాయి. వారిని ఒప్పించేందుకు వీరిద్దరు ఆరేళ్లు నిరీక్షించారు. చివరకు పెద్దల ఆశీర్వాదంతో సంజన-నాగరాజు జంట ఒక్కటైంది. తెలుగువారికి శ్రావణ మాసం ఎలాగో.. తమిళులకు ఆవణి మాసం అంత పవిత్రమైంది. కడలూరు జిల్లాలోని తిరువంతీపురంలో దేవనాథ స్వామి ఆలయంలో ఒక్క రోజు 84 వివాహాలు జరిగాయి.
అందులో ట్రాన్స్‌జెండర్ సంజన వివాహం కూడా ఉంది. మొత్తానికి కుటుంబ సభ్యుల అంగీకారంతో కోరుకున్న ప్రియుడు నాగరాజ్ ని వివాహం చేసుకుంది. తమిళనాడులో ట్రాన్స్‌జెండర్లు వివాహాలు చేసుకోవడంతో సాదారణంగా మారింది. ఏడాదిలో కనీసం నాలుగైదు పెళ్లిళ్లు ఈ విధంగా జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి.
జూలైలో ఈరోడ్ జిల్లాలో ఓ ట్రాన్స్ జెండర్‌ని వివాహం చేసుకున్నాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వారిద్దరు సోషల్‌మీడియా పరిచయం అయ్యారు. అది కాస్త ప్రేమగా మారింది. చివరకు సన్నిహితుల మధ్య రిజిస్ట్రార్ ఆఫీసులో దండలు మార్చుకున్న విషయం తెల్సిందే.
ALSO READ: ఆసుపత్రిలో భారీ ఆగ్ని ప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి