E-Paper
Advertisement

సీఎం విజయ్ సంచలన ప్రకటన.. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, సభలో గగ్గోలు పెట్టిన విపక్షాలు

సీఎం విజయ్ సంచలన ప్రకటన.. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, సభలో గగ్గోలు పెట్టిన విపక్షాలు
Advertisement

Vijay Govt: తమిళనాడులో రెండు దశాబ్దాలు అధికారంలో ఉండేలా విజయ్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. విపక్షాలను ఇరుకున పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ ప్రకటన చేయడం మిగతా పార్టీలకు మింగడు పడడం లేదు. తాజాగా ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పేరిట పథకాన్ని ప్రకటన చేశారు సీఎం విజయ్. అంతేకాదు ఉచిత బస్సు సదుపాయాన్ని డీలక్స్ బస్సులకు విస్తరించడం వెల్లడించారు. దీంతో విపక్షాలు ఒక్కసారిగా సభలో గగ్గోలు పెట్టాయి.

 

అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన ప్రకటన

Advertisement

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు నిత్యం వార్తల్లోకి వస్తున్నాయి. రెండు లేదా మూడు రోజులకు ఒకసారి సీఎం విజయ్ చేస్తున్న ప్రకటనలు విపక్షాలకు మింగుడుపడడం లేదు. మొన్న ప్రజాప్రతినిధులకు ఉచిత కార్లు, నిన్న పుట్టే పిల్లకు బంగారు స్కీమ్, ఇవాళ మహిళల వంతైంది. తాజాగా మహిళలపై వరాలు జల్లు కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, విపక్షాలను ఇరకాటంలోకి నెట్టేసేలా నిర్ణయాలు తీసుకున్నారు.

ఫ్యామిలీకి మూడు గ్యా్స్ సిలిండర్లు ఇస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు సీఎం విజయ్. ఈ పథకానికి ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పేరు ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. అర్హులైన గృహిణులకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. తొలుత డబ్బులు కట్టి మహిళలు తీసుకోవాలి. ఆ తర్వాత వాటి నిధులను మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

Advertisement

 

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం,  ఇకపై ప్రీ బస్సులు డీలక్స్ వరకు

ఈ పథకం ద్వారా మొత్తం 1,30,16,104 కుటుంబాలు లబ్ధి చేకూరనుంది. దీనివల్ల సుమారు రూ. 4,000 కోట్లు భారం ప్రభుత్వంపై పడుతుందని ఓ అంచనా. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళగ వెట్రి కళగం పార్టీ ఆరు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తామని ప్రకటన చేసిన విషయం తెల్సిందే. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించని కుటుంబాలు, మధ్యతరగతి, చిన్న/సన్నకారు రైతుల కుటుంబాలు అర్హులు.

దీనికితోడు తమిళనాడు వ్యాప్తంగా ఫ్రీ బస్సు సేవలను విస్తరించారు. గతంలో రూరల్ బస్సులు, సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ట్రావెల్ చేసేవారు. ఇకపై ఎక్స్ ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్ బస్సుల్లో ఆ అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రతీ మహిళ, ట్రాన్స్ జెండర్‌కు వర్తించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. మహిళలకు ప్రయోజనాలను చేకూర్చే విధంగా వెట్రి పయనం (Vetri Payanam) ఉచిత ప్రయాణ పథకం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి అమలులోకి రానుంది.

ALSO READ: ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌ జెండర్.. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి

నాలుగు నెలల కిందట అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం, మహిళలను లక్ష్యంగా చేసుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే సింగప్పెన్ స్పెషల్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్కీమ్, థాయ్ మామన్ గోల్డ్ రింగ్ స్కీమ్, వెట్రి మహిళల మేకల పెంపకం పథకం, అన్నన్ సీర్ స్కీమ్‌లను ప్రస్తావిస్తూ విజయ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సుల వంతైంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని పథకాలు ప్రకటన ఉంటుందో చూడాలి. ఇలా మహిళల ఆధారంగా విజయ్ ప్రభుత్వం ప్రకటన చేయడంపై విపక్షాలు సభలో గగ్గోలు పెట్టాయి.

 

Related News

ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌ జెండర్.. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి, ఇంతకీ ఎక్కడో తెలుసా?

అమరావతి ఆసుపత్రిలో భారీ ఆగ్ని ప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి, ఒక్కసారిగా పేలిన వెంటిలేటర్

కేంద్ర ప్రభుత్వంలో 8.23 లక్షల ఉద్యోగ ఖాళీలు.. ఆర్టీఐలో కీలక వివరాలు

బహవల్‌పూర్‌లోని ఉగ్ర కేంద్రం మళ్లీ రీ-ఓపెన్.. కేంద్ర హోంశాఖకు సంచలన నివేదిక!

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. జగన్‌కు సహాయం కోసమా?

బుక్కైన ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్‌.. రీల్స్ కోసం రోడ్డుపై రచ్చ, వీడియో వైరల్

జెన్ జెడ్-జెన్ ఆల్ఫా ఇష్యూ.. నితిన్ కొత్త టీమ్‌తో నాలుగున్నర గంటలు, ఒకొక్కరితో మోదీ మాటామంతీ

Big Stories

Advertisement
×