E-Paper
Advertisement

బుక్కైన ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్‌.. రీల్స్ కోసం రోడ్డుపై రచ్చ, వీడియో వైరల్

బుక్కైన ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్‌.. రీల్స్ కోసం  రోడ్డుపై రచ్చ, వీడియో వైరల్
Advertisement

Prakruti Gaur: దేనికైనా హద్దు పద్దు ఉంటుంది.. అది కాస్త శృతిమించితే ఇబ్బందులు తప్పవు. ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి విషయంలో అదే జరిగింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే లోపల సీరియస్‌గా అయినా, బయటకు మాత్రం కూల్‌గా మాట్లాడింది. ఇంతకీ ఆమె రోడ్లపై ఏం చేసింది?

అడ్డంగా దొరికిపోయిన ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్‌

సోషల్‌మీడియా యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. చదువు, ఉద్యోగాలు వదిలేసి మరీ లైక్‌లు, షేర్లు పెంచుకోవడానికి రకరకాల పనులు చేస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో పిచ్చి పనులు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా. కేవలం తమ అకౌంట్లలో వ్యూస్ పెంచుకోవడానికి అన్నింటికి గాలికి వదిలేస్తున్నారు. ఏం జరిగితే తమకెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఇన్ఫ్లుయెన్సర్ అంటూ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

 

రీల్స్ కోసం రోడ్డుపై రచ్చ చేసిన ప్రకృతి

తాజాగా ఇండోర్ సిటీలో అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం పబ్లిక్ రోడ్డుపై నానాహంగామా చేసింది ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్‌. ఏకంగా జీబ్రా క్రాసింగ్‌పై నడిరోడ్డులో పడుకుని వీడియో షూట్ చేయడం కలకలం రేపింది. ఈమె షూట్ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రకృతి విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ఏ మాత్రం ఆలోచించకుండా ఆమెపై కేసు నమోదు చేశారు. పబ్లిక్ రోడ్లలో ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. BNS లోని కఠినమైన సెక్షన్లు 270, 285 కింద కేసు నమోదు చేశారు.

Advertisement

ALSO READ: జెన్ జీల వ్యవహారం.. నితిన్ టీమ్‌తో నాలుగున్నర గంటలపాటు మోదీ మంతనాలు

ఎఫ్ఐఆర్ నమోదు చేయడమేకాదు, రీల్స్ చిత్రీకరించడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేయడం విషయం తెలియగానే ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాలని చేయలేదని పేర్కొంది. రీల్ కోసమే అలా చేశానని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని వివరణ ఇచ్చింది. ప్రకృతి క్షమాపణల వీడియోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత వీడియోను పబ్లిసిటీ కోసం ఆమె తన ప్రొఫైల్‌లో పిన్ చేసి ఉంచడం మండిపడ్డారు. ఆమె డబుల్ స్టాండర్డ్స్ వైఖరికి నిదర్శమని చెబుతున్నారు.

 

?utm_source=ig_embed&ig_rid=AhLtkWfgR1URblT452LiOs8

 

 

?utm_source=ig_embed&ig_rid=AdOogOLhpc5RG7j1chMxCiP

 

 

 

Related News

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

Big Stories

Advertisement
×