Hospital Massive Fire: మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు శిశువులు మృతి చెందారు. ఆసుపత్రి మూడో అంతస్తులో ఎన్ఐసీయూ విభాగంలో వెంటిలేటర్ పేలిపోవడంతో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ప్రమాదం సమయంలో అక్కడ 39 మంది శిశువులు ఉన్నారు. మిగతావారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అసలు ఘటన ఎప్పుడు, ఎలా జరిగింది?
సోమవారం ఉదయం మహారాష్ట్ర అమరావతి జిల్లా ఓ మహిళా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక విభాగంలో వెంటిలేటర్ పేలిపోయింది. ఫలితంగా ఆసుపత్రి అంతా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. మంటల త్వారా వచ్చిన పొగ పీల్చడం వల్ల ముగ్గురు నవజాత శిశువులు మరణించారు.
సంఘటన జరిగిన సమయంలో ఆ వార్డులో 39 మంది నవజాత శిశువులు ఉన్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది వెంటిలేటర్లు తొలగించి మిగతా వారిని ప్రమాదం నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అందులో మరో ఆరుగురు శిశువులను అత్యవసర చికిత్స కోసం సమీపంలోని సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు అగ్ని కీలలు ఎగసిపడటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు మూడు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ట్రీట్మెంట్ అందిస్తున్న శిశువుల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు.
ALSO READ: కేంద్ర ప్రభుత్వంలో 8.23 లక్షల ఉద్యోగ ఖాళీలు.. ఆర్టీఐలో కీలక వివరాలు
ఇలాంటి ఘటనలు చాలా తీవ్రమైనది. ఎందుకంటే NICU లోని శిశువులు తరచుగా వెంటిలేటర్లపై ఆధారపడి ఉంటారు. వైద్యుల సలహా లేకుండా వారిని కదిలించడం సాధ్యం కాదు. అమరావతిలో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో సిబ్బంది నవజాత శిశువులను వెంటిలేటర్ల నుండి తొలగించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అమరావతి ఆసుపత్రిలో విషాదం అనేక ఇతర ఘటనలను గుర్తు చేస్తుంది. రెండేళ్ల కిందట 2024 నవంబర్‌లో ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 10 మంది శిశువులు మరణించారు. వార్డులో 49 మంది శిశువులు ఉండగా సిబ్బంది 38 మందిని మాత్రమే కాపాడారు. ఈ ఘటపలో 16 మంది శిశువులు గాయపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు అనుమానాలు నెలకున్నాయి. అంతకుముందు 2024 మే నెలలో ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఉన్న బేబీ కేర్ న్యూ బార్న్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఏడుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.
#Amravati Hospital Fire : महाराष्ट्र के #अमरावती स्थित जिला महिला अस्पताल में आग लगने से 3 नवजात बच्चों की मौत हो गई।#Hospital pic.twitter.com/VtdyoTHszz
— ज़ाहिद अब्बास 🚜🌾 (@abbaszahid0512) August 24, 2026