E-Paper
Advertisement

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. జగన్‌కు సహాయం కోసమా?

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. జగన్‌కు సహాయం కోసమా?
Advertisement

Praveen Prakash:  దేశంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. పదవీ విరమణ తర్వాత అధికారులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆ జాబితాలోకి ఏపీ మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కూడా చేరిపోయాడు. తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంట్రీ కావడం హాట్ హాట్ చర్చ మొదలైంది.

 

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రవీణ్ ప్రకాష్

Advertisement

యువత రాజకీయాల్లోకి రావాలని పదే పదే నేతలు చెబుతుంటారు. అక్కడ అందరూ రాణించలేదు. ఎందుకంటే పాలనలో సహాయం చేసిన మాజీ అధికారులకు పెద్ద పీఠ వేస్తుంటాయి పార్టీలు. దేశంలోని అన్ని రాజకీయాల పరిస్థితి దాదాపు ఇంతే. తాజాగా ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఏడాదిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆగస్టు 3న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

 

వారణాసి నుంచి బరిలోకి.. మరి జగన్ మాటేంటి?

Advertisement

ఆయన ఏ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వారణాసి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. తొలుత అసెంబ్లీ బరిలో తన నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆలోచన చేస్తున్నారు. అక్కడ సక్సెస్ కాకుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి బరిలోకి దిగాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. ఎందుకంటే వారణాసి లో ఎక్కువగా తెలుగు ఓటర్లు ఉండడమే అందుకు కారణంగా చెబుతున్నారు. వారణాసిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన వ్యక్తులు ఉన్నారు. వారిని ఎదురించి ఆయన సీటు దక్కించుకుంటారా? అన్నది మరొక ప్రశ్న. అక్కడ సీటు దక్కించుకోవాలన్నా,  మంత్రి చేపట్టాలన్నా కులాల ప్రాతిపదికనే జరుగుతుంది.

ALSO READ: బుక్కైన ఇన్ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్‌.. రీల్స్ కోసం రోడ్డుపై రచ్చ, వీడియో వైరల్

ఇదే సమయంలో మరో టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. వైసీపీ నుంచి సాయిరెడ్డి తప్పుకున్న తర్వాత జాతీయ పార్టీలతో వైసీపీకి సంబంధాలు లేవని అంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్‌కు ఆయన సహాయం చేయవచ్చనే వాదన లేకపోలేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏదోఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తోందట వైసీపీ. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్‌ను జగన్ పంపించారన్న వాదన సైతం లేకపోలేదు. అధికారిగా మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణ్ ప్రకాష్, యూపీ ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. అలాగే కాంగ్రెస్ పెద్దలకు ఏ విధంగా దగ్గరవుతారో కూడా చూడాలని అంటున్నారు.

Related News

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

Big Stories

Advertisement
×