E-Paper
Advertisement

జెన్ జెడ్-జెన్ ఆల్ఫా ఇష్యూ.. నితిన్ కొత్త టీమ్‌తో నాలుగున్నర గంటలు, ఒకొక్కరితో మోదీ మాటామంతీ

జెన్ జెడ్-జెన్ ఆల్ఫా ఇష్యూ.. నితిన్ కొత్త టీమ్‌తో నాలుగున్నర గంటలు, ఒకొక్కరితో మోదీ మాటామంతీ
Advertisement

Delhi: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కొత్త సమస్య మొదలైందా? ప్రతిపక్షాల కంటే యువత ఇప్పుడు ఆ పార్టీకి కంట్లో నలుసుగా తయారు అయ్యారా? వారిని ఎదుర్కోవడానికి బీజేపీ పక్కాగా ప్లాన్ చేస్తోందా? నితిన్ కొత్త టీమ్‌తో దాదాపు నాలుగున్నర గంటలపాటు ప్రధాని మోదీ భేటీ వెనుక ఏం జరిగింది? యువతకు మరింత చేరువ కావాలని నొక్కి చెప్పారా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.

 

జెన్ జెడ్-జెన్ ఆల్ఫాపై బీజేపీ ఫోకస్

Advertisement

ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో కొత్త కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. దాదాపు నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో కార్యవర్గంలోని ప్రతీ సభ్యుడితో వ్యక్తిగతంగా మాట్లాడి తన అనుభవాలను పంచుకున్నారు ప్రధాని. సంస్థాగతంగా తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో వారు ఎలా పని చేశారో, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. నేతల చెప్పిన మాటలను క్షుణ్నంగా విన్నారు ప్రధాని. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 65 మంది నేతలతో ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడారు.

నితిన్ కొత్త కార్యవర్గంతో మోదీ నాలుగున్నర గంటల భేటీ

తన అనుభవాలను పంచుకుని, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహాలను చర్చించారు. పార్టీని బలోపేతం చేసి నూతన కార్యవర్గం ఆలోచనలను ప్రోత్సహించాలని కొత్త బృందాన్ని కోరారు. ప్రజలతో మరింత లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని వారికి సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ప్రధాని. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత సమస్యలు, యువతకు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.  అంతేకాదు కొత్త కార్యవర్గం సభ్యులతో కలిసి భోజనం చేశారట ప్రధాని మోదీ. అధ్యక్షుడు నితిన్ నవీన్, బిఎల్ సంతోష్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు.

యూత్‌ని టార్గెట్ చేస్తూ కొత్త కార్యక్రమాలు

Advertisement

పార్లమెంటరీ బోర్డు సభ్యుల పేర్లపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆయా పేర్లను సమయం, సందర్భం చూసి ప్రకటించే అవకాశం ఉంది. శనివారం సమావేశంలో యువతతో నిరంతరం సంబంధాలను పెంచుకోవాలని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కొత్త బృందాన్ని కోరారు. వారి పేరు మీద ఓ పేరిట కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో యువతను పార్టీలో చేర్చుకోవడం కోసం భారీ ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.  దేశవ్యాప్తంగా పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. ఈ బృందాలను ఏర్పాటు చేయడంలో పార్టీ యువ మోర్చా సహాయం చేయనుంది. దీనికితోడు రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, సంస్థాగత వ్యూహంపై లోతుగా చర్చించారు. ఆగస్టు 17న బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ కొత్తగా 65 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీతో జరిగిన తొలి సమావేశం. ఆదివారం మరికొందరు నేతలతో ప్రధాని భేటీ కానున్నారు.

ALSO READ: రెస్టారెంట్‌లో కస్టమర్‌కు ఘోర అవమానం.. బెంగుళూరులో ఘటన, ఏం జరిగిందంటే..

Related News

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

Big Stories

Advertisement
×