E-Paper
Advertisement

బహవల్‌పూర్‌లోని ఉగ్ర కేంద్రం మళ్లీ రీ-ఓపెన్.. కేంద్ర హోంశాఖకు సంచలన నివేదిక!

బహవల్‌పూర్‌లోని ఉగ్ర కేంద్రం మళ్లీ రీ-ఓపెన్.. కేంద్ర హోంశాఖకు సంచలన నివేదిక!
Advertisement

Jaish Headquarters: ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత వైమానిక దాడుల్లో ధ్వంసం అయిన జైష్ ఏ మొహమ్మద్ ఉగ్ర సంస్థ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మితమైంది. దీనికోసం పాకిస్తాన్ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను సమకూర్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన నివేదికను నిఘా వర్గాలు కేంద్ర హోం శాఖకు అందించినట్టు సమాచారం. పహల్గావ్ లో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఉగ్ర అడ్డాలపై బాంబుల వర్షం..

ఇందులో భాగంగా మన వైమానిక బలగాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోపాటు పాకిస్తాన్‌లోని బవహల్ పూర్.. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలపై భీకర దాడులు చేసింది. ఉగ్ర అడ్డాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రధాన కేంద్రమైన మర్కజ్ సుభాన్ అల్లాహ్ భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. తాజా నిఘా వర్గాల నివేదికల ప్రకారం ఈ భవనాన్ని పునర్నిర్మించారు.

Advertisement

Also read: అంజయ్య నగర్ ప్రమాదంలో బయటపడ్డ సంచలనాలు.. బిల్డర్ సాజిద్ అక్రమాల చిట్టా రట్టు!

జైష్ ఏ మొహమ్మద్ సంస్థ..

కొత్త గుమ్మస్ లు ఏర్పాటు చెయ్యటంతోపాటు మార్బుల్ ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్ పనులు పూర్తి చేశారు. దీనికోసం పాకిస్థాన్ ప్రభుత్వం దాదాపు 25 కోట్ల రూపాయలను జైష్ ఏ మొహమ్మద్ సంస్థకు సమకూర్చినట్టు సమాచారం. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న18 ఎకరాల ఈ కేంద్రంలో ఉగ్రవాద శిక్షణ, నియామకాలు, సమావేశాల కోసం ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం జైష్ ఏ మొహమ్మద్ ఛీఫ్ మసూద్ అజహర్ అనారోగ్యంగా ఉండటంతో అతని సోదరులు ఉగ్రవాద కార్యకలాపాలను చూసుకుంటున్నారని సమాచారం.

Advertisement

Also read: తెలంగాణ రైజింగ్ కు గ్లోబల్ అంబాసిడర్లుగా మారండి ఎన్ఆర్ఐలకు సీఎం రేవంత్ పిలుపు!

Tags

Related News

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

Big Stories

Advertisement
×