E-Paper
Advertisement

తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ

తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ
Advertisement

Tungabhadra: తుంగభద్ర ప్రాజెక్టు వేదికగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.  ముఖ్యమంత్రుల భేటీపై అప్పుడే రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ సీఎంలు మాట్లాడుకున్న రాజకీయ అంశాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు కలయిక

Advertisement

కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు డామ్ గేట్లను ప్రారంభించారు తెలుగు, కర్ణాటక సీఎంలు. ఈ కార్యక్రమం గతరాత్రి కర్నూలులో ఉన్న సీఎం చంద్రబాబు, గురువారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హోస్పేటకు చేరుకున్నారు. ఈలోగా సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా అక్కడికి చేరుకున్నారు.

హోస్పేట్‌లోని ఐఆర్బీ అతిథి గృహంలో ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై నేతలంతా చర్చించుకున్నారు. ఈ భేటీ దేశంలోని రాజకీయాల గురించి ప్రధానంగా చర్చించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.  సీఎంలు ఏం మాట్లాడుకున్నారంటూ అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది.

Advertisement

దేశ రాజకీయాలతోపాటు వివిధ అంశాలపై చర్చ?

కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓ టాస్క్ అప్పగించినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో పార్టీ అధికారంలో ఉందని, ఏపీలో లేదని చెప్పారట. అక్కడి నేతలతో మంతనాలు జరపాలని టాస్క్ అప్పగించినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇప్పటివరకు సీఎం శివకుమార్ ఎవరితో మాట్లాడిన సందర్భం లేదని, తొలిసారి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కూడా ఉన్నారని, అక్కడ రాజకీయాల గురించి మాట్లాడే ఛాన్స్ లేదన్నది కొందరి నేతలు మాట.

ALSO READ: ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు ‘నో’ చెప్పిన సుప్రీంకోర్టు!

ముఖ్యమంత్రుల మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది పక్కన బెడితే పైన రాసిన విధంగా ప్రచారం సాగుతోంది. ఏపీలో కూటమిని విడగొట్టేందుకు ఇదీ కూడా ఓ స్కేచ్చేనని అంటున్నవాళ్లూ లేకపోలేదు. మొత్తానికి నేతల మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయో తెలియగానే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే?

Related News

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!

Big Stories

Advertisement
×