E-Paper
Advertisement

ఆకాశంలో బిగ్ సర్ప్రైజ్.. ఫ్లైట్ నడిపిన బిజెపి ఎంపీ!

ఆకాశంలో బిగ్ సర్ప్రైజ్.. ఫ్లైట్ నడిపిన బిజెపి ఎంపీ!
Advertisement

Rajiv Pratap Rudy: ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లే విమానంలో ఇటీవల ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. సాధారణంగా ఎంపీలు విమానాల్లో ప్రయాణికులుగా వెళ్లడం చూస్తుంటా. కానీ, ఒక సీనియర్ ఎంపీ ఏకంగా కాక్‌పిట్‌లో కూర్చోని విమానాన్ని నడిపితే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి సయ్యద్ షాహనవాజ్ హుస్సేన్‌కు సరిగ్గా అలాంటి అరుదైన అనుభవమే ఎదురైంది.

కాక్‌పిట్‌లో ఎంపీ.. ప్రయాణికుల్లో ఆశ్చర్యం!

Advertisement

షాహనవాజ్ హుస్సేన్ ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణిస్తున్న సమయంలో, ఆ విమానానికి కమాండర్ గా ఉన్నది ఎవరో కాదు.. ఆయన సహచర బీజేపీ ఎంపీ, సీనియర్ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ రాజీవ్ ప్రతాప్ రూడీ! విమానం ల్యాండ్ అయిన తర్వాత తన మిత్రుడిని కాక్‌పిట్‌లో చూసిన షాహనవాజ్ హుస్సేన్ ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషపడ్డారు. వెంటనే ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

అద్భుతమైన ల్యాండింగ్.. బహుముఖ ప్రజ్ఞాశాలి

Advertisement

రాజీవ్ ప్రతాప్ రూడీ విమానాన్ని నడిపిన తీరు, ముఖ్యంగా ల్యాండింగ్ చేసిన విధానం చాలా సున్నితంగా, అద్భుతంగా ఉందని షాహనవాజ్ హుస్సేన్ కొనియాడారు. ‘ప్రపంచంలోనే పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ, కమర్షియల్ విమానాలను నడపగల ఏకైక ఎంపీ బహుశా రాజీవ్ ప్రతాప్ రూడీ ఒక్కరే కావచ్చు’ అని పేర్కొన్నారు. రూడీ కేవలం ఒక రాజకీయనాయకుడే కాదు.. ఆయనొక న్యాయవాది, ప్రొఫెసర్, నైపుణ్యం కలిగిన పైలట్. అన్నింటికీ మించి మంచి మనసున్న మానవతావాది, ఆత్మీయ మిత్రుడు అని ప్రశంసించారు.

బీహార్ గర్వించదగ్గ నాయకుడు

తన మిత్రుడితో కలిసి ప్రయాణించడం ఎంతో ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇచ్చిందని షాహనవాజ్ హుస్సేన్ అన్నారు. రాజీవ్ ప్రతాప్ రూడీ ఇలాగే అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ, తన సేవలతో బీహార్ రాష్ట్రానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని, దేవుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు, శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Also Read: కల్తీ తిని రోగాల బారిన పడుతున్నారా? కరీంనగర్ ఇంజనీర్ సూపర్ సొల్యూషన్!

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×