E-Paper
Advertisement

కిలాడీ భామ.. బెడ్‌పై నోట్ల కట్టలు, చేతిలో గన్.. రూ. 6 కోట్ల హనీట్రాప్ కేస్!

కిలాడీ భామ.. బెడ్‌పై నోట్ల కట్టలు, చేతిలో గన్.. రూ. 6 కోట్ల హనీట్రాప్ కేస్!
Advertisement

Honey Trap: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ సంచలన హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ అయిన టిండర్, సామాజిక మాధ్యమాల ద్వారా పురుషులకు వలవేసి.. వారి నుంచి రూ.కోట్లలో ఓ యువతి వసూలు చేసినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ హనీ ట్రాప్ గుట్టురట్టయింది.

స్నేహం పేరుతో వల..

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలిగా పల్లవి సింగ్ రాజ్‌పుత్ (Pallavi Singh Rajput) అనే మహిళ పేరు తెరపైకి వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో ‘స్వీటీ తివారీ’ వంటి విభిన్న పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచి పురుషులకు వల వేసినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. బాధితులతో తొలుత పరిచయం పెంచుకొని.. దానిని శారీరక బంధంగా ఆమె మార్చినట్లు పేర్కొన్నారు. అనంతరం బాధితులతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసేదన్నారు. తర్వాత వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు  న్యాయవాది పేర్కొన్నారు.

రూ.కోట్ల రూపాయల వసూలు

Advertisement

నగ్న ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకొని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ యువకులను పల్లవి బెదిరించినట్లు తెలుస్తోంది. అత్యాచారం, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరారోపణల కింద కేసులు పెడతానని హెచ్చరించి బాధితుల నుంచి భారీ మెుత్తం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఇప్పటివరకు దాదాపు రూ.6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. మరోవైపు ఈమె పెట్టిన కేసుల కారణంగా ఐదుగురు వ్యక్తులు జైలుకు కూడా వెళ్లారని తెలిపారు.

సోషల్ మీడియాలో ఆధారాలు

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ ఫొటోలో బెడ్‌పై పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఉండగా.. దాని పక్కన స్టైల్ గా ఫోన్ చూస్తూ ఆమె కనిపించింది. అలాగే మరో ఫొటోలో తుపాకీ పట్టుకొని కెమెరా ఫోజు ఇచ్చినట్లుగా ఉంది. అయితే ఈ ఫోటోలు ఎప్పటివి? ఆరోపణల వెనుక నిజానిజాలేంటి? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Also Read: మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!

పోలీసుల దర్యాప్తు వేగవంతం

న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా.. ప్రయాగ్ రాజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పల్లవి రాజ్ పుత్ వెనుక ఓ గ్యాంగ్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పల్లవికి మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆరోపణలన్నింటిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వెనుక ఉన్న ముఠా వివరాలను పూర్తిగా వెలికితీసేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు వివరించారు.

Also Read: లోకల్ రైలులో దారుణం.. సీటు కోసం మహిళపై బెల్టుతో దాడి.. ఎంతకు తెగించావ్ రా!

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×