E-Paper
Advertisement

Union Budget-2026: నిర్మలా సీతారామన్‌ బడ్జెట్.. దశాబ్దాల సంప్రదాయానికి చెక్, పార్ట్-బీపై ఫోకస్

Union Budget-2026: నిర్మలా సీతారామన్‌ బడ్జెట్.. దశాబ్దాల సంప్రదాయానికి చెక్, పార్ట్-బీపై  ఫోకస్
Advertisement

Union Budget-2026: కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్‌ తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ వికసిత్‌ భారత్‌ థీమ్‌గా ఉండబోతోంది. వరుసగా తొమ్మిది సార్లు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ఆమె మరో రికార్డు సృష్టించనున్నారు. అంతేకాదు దేశ చరిత్రలో ఆదివారం పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి.

కేంద్రమంత్రి నిర్మలా బడ్జెట్

Advertisement

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ ద్వారా దశాబ్దాల సంప్రదాయానికి ఆమె తెర దించనున్నట్లు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆమె ప్రసంగంలో పలు మార్పులు చేసినట్టు ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నార్మల్‌గా ఏడాది బడ్జెట్ రెండు విధాలుగా ఉంటుంది.

అందులో పార్ట్‌-ఎ, పార్ట్-బీ ఉంటుంది. ఈసారి సీతారామన్ పార్ట్‌-బిపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టు అందులోని సారాంశం. సాధారణంగా పార్ట్‌-ఎలో దేశ ఆర్థిక స్థితిగతులు, గణాంకాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. పార్ట్‌-బిలో మాత్రం పన్ను ప్రతిపాదనలు, సాంకేతికపరమైన ప్రకటనలకు ఈసారి పరిమితం చేసినట్టు తెలుస్తోంది. ఈసారి మొదటి పార్టు కంటే సెకండ్ పార్ట్‌కు మంత్రి సుదీర్ఘంగా చదవనున్నట్లు సమాచారం.

Advertisement

దశాబ్దాల సంప్రదాయానికి చెక్, పార్ట్-బీపై ఫోకస్

ప్రభుత్వ విధానపరమైన చర్యలు, ఆర్థిక లక్ష్యాలు రెండింటికీ ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు ఆర్థిక వర్గాలు చెబుతున్నమాట. దీర్ఘకాలిక నిర్మాణ సంస్కరణలతో స్వల్పకాలిక వృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక సంక్షేమాన్ని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం ఎలా ప్రణాళికలు వేస్తుందో ఈ భాగంలో వివరించాలని భావిస్తున్నారు.

21వ శతాబ్దం రెండవ త్రైమాసికంలోకి అడుగుపెడుతున్నందున భారతదేశం ఆర్థిక దృక్పథాన్ని వివరించనున్నారు. అభివృద్ధి చెందుతున్నవిధానం, దేశీయ సవాళ్లకు అనుగుణంగా కొత్త చొరవలను హైలైట్ చేస్తుందని అంటున్నారు. 21వ శతాబ్దంలో విస్తరిస్తున్న ప్రాధాన్యతలను అనుగుణంగా ఈ మార్పు ప్రతిబింబించనుంది.

ALSO READ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. గవర్నర్ సమక్షంలో బాధ్యతలు

దేశ వాణిజ్యం, తయారీ, ఎగుమతుల విషయంలో సామర్థ్యాలను వెల్లడించనున్నారు. భవిష్యత్‌లో అభివృద్ధి అవకాశాలపై ప్రసంగంలో ప్రస్తావించనున్నారు విత్త మంత్రి. ప్రస్తుత బడ్జెట్‌లో సంస్కరణలకు ఇవ్వనున్నారు.అంతేకాదు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×