E-Paper
Advertisement

Vijay – Rashmika : విజయ్- రష్మిక పెళ్లి డేట్ లాక్.. పెళ్లి ఎక్కడంటే..?

Vijay – Rashmika : విజయ్- రష్మిక పెళ్లి డేట్ లాక్.. పెళ్లి ఎక్కడంటే..?
Advertisement

Vijay – Rashmika : టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరు ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రెడ్’ వంటి సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. ఆన్ స్క్రీన్ వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఈ జంట మరో సినిమాలో కనిపిస్తే బాగుండు అని సినీ లవర్స్ కూడా అనుకున్నారు.. మరి కొంతమంది రియల్ లైఫ్ లో కూడా వీళ్ళిద్దరూ కపుల్ గా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు.. సినిమాలతో బిజీగా ఉన్న ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.. ఇటీవల వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలు వినిపించాయి. కానీ వీళ్లిద్దరు ఆ విషయాన్ని బయట పెట్టలేదు.. ఈ నెలలోనే వీరిద్దరు పెళ్లి జరగబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి . కానీ ఇప్పుడు పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరుగుతుంది? అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

విజయ్ – రష్మిక పెళ్లి డేట్ లాక్..? 

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని ఇండస్ట్రీలో ఓ న్యూస్ గుప్పుమంది. ఓ ఈవెంట్‌లో రష్మిక చేతికి ఉంగరం ఉండటంతో ఈ పుకార్లకు ఆజ్యం పోయినట్లయింది. ఈక్రమంలో వీరిద్దరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. రాజాస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత స్ననిహితుల మధ్య ఫిబ్రవరి 26న ఈ జంట మ్యారేజ్ చేసుకొనున్నట్లు సమాచారం.. ఈ డేట్ గురించి అతి త్వరలోనే ప్రకటన రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో విజయ్ అభిమానులు, అలాగే రష్మిక అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. స్క్రీన్ మీద ఉన్న వీళ్ళు రియల్ లైఫ్ లో భార్యాభర్తలు కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Also Read:మూడేళ్లు నరకం చూశాను.. మూటలు మోసాను..భార్య పై షాకింగ్ కామెంట్స్..

పెళ్లికి గెస్టులు ఎవరంటే..? 

విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి పై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది.. ఇన్నాళ్లకు ఈ న్యూస్ నిజం కాబోతుందని తెలుస్తుంది. వీరిద్దరి పెళ్లిని ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక త్వరలోనే తీరబోతుందని తెలుస్తుంది. ఈనెల ఫిబ్రవరి 26న వీళ్ళ పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. అయితే రాజస్థాన్లో ఈ పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం.. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ బాబు, నితిన్ లతో, తమిళ హీరోలు అలాగే బాలీవుడ్ హీరోలతో పాటుగా పలువురు హీరోయిన్లు కూడా హాజరుకానున్నారని ఓ వార్త వినిపిస్తుంది.. ఇక ఈ జంట కెరీర్ విషయానికొస్తే.. ఇద్దరు కూడా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు..

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×