BigTV English

Delhi Murder: జాగింగ్ కి వెళ్లి వచ్చేసరికి అమ్మా చెల్లి నాన్న మర్డర్, మరీ ఇంత ఘోరంగానా?

Delhi Murder: జాగింగ్ కి వెళ్లి వచ్చేసరికి అమ్మా చెల్లి నాన్న మర్డర్, మరీ ఇంత ఘోరంగానా?

Delhi Triple Murder Case: దేశ రాజధాని న్యూఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ ఘటన సంచలనం కలిగించింది. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారితే పెళ్లి రోజు అనగా దంపతులు, వారి కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య  చేశారు. ఇవాళ తెల్లవారుజామున నెబ్ సరాయ్ ప్రాంతల్లో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలోని ప్రజలను షాక్ కు గురి చేసింది.


అసలు ఏం జరిగిందంటే?

ఢిల్లీలోని నెబ్‌ సరాయి ప్రాంతంలో రాజేష్(55), కోమల్(47)దంపతులు తమ కుమార్తె కవిత(23), కొడుకుతో కలిసి నివసిస్తున్నారు. ఎప్పటి లాగే ఇవాళ ఉదయం 5 గంటలకు వారి అబ్బాయి వాకింగ్ కు బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి షాక్ అయ్యాడు. తన తల్లిదండ్రులు, చెల్లి రక్తం మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


తెల్లవారితో పెళ్లి రోజు

ఇక రాజేష్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. డిసెంబర్ 4న రాజేష్, కోమల్ దంపతుల వివాహ వార్షికోత్సవం. ఈ వేడుకల కోసం అప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. తెల్లవారితో సంతోషంగా తమ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుదామనేలోగా ఈ ఘోరం జరిగిందన్నారు. మార్నింగ్ వాక్ కు వెళ్లకుంటే తన ప్రాణాలు కూడా పోయేవంటూ కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు. ఇంట్లో ఎలాంటి వస్తువుల దొంగతనం జరగలేదని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామని తెలిపారు.

Read Also: ఆత్మహత్యల కేసుల్లో బ్రేకప్ చేసుకున్నవారిని శిక్షించలేం.. సుప్రీం తీర్పు

త్రిపుల్ మర్డర్ పై అతిషి, అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం   

నెబ్‌ సరాయి ప్రాంతంలో జరిగిన త్రిపుల్ మర్డర్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి స్పందించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో కేంద్రం విఫలం అయ్యిందని ఆరోపించారు. “ఈరోజు తెల్లవారుజామున నెబ్ సరాయ్‌ లో ట్రిపుల్ మర్డర్ జరిగింది. ఢిల్లీలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి. గన్స్ పేలుతున్నాయి. డ్రగ్స్ బహిరంగంగా అమ్ముతున్నారు. వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది” అని సోషల్ మీడియా వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు ఢిల్లీలో శాంతి భద్రతలు కుప్పకూలాయని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.”నెబ్ సరాయ్‌లో ఒకే ఇంట్లో మూడు హత్యలు జరిగాయి. ఇది చాలా బాధాకరం, భయానకం. ప్రతిరోజూ ఢిల్లీ వాసులు ఇలాంటి భయపెట్టే వార్తలతో నిద్ర లేస్తున్నారు. అమాయకులు ప్రాణాలు పోతున్నాయి.  దేశ రాజధానిలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు కుప్పకూలాయి. అయినా, కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న విషయం తెలిసిందే!

Read Also: అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో కాల్పుల కలకలం, అసలేం జరిగింది?

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×