Big Stories

Uttarakhand Tunnel: శరవేగంగా డ్రిల్లింగ్ పనులు.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో హైటెన్షన్

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్​‌లోని ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు 17వ రోజుకు చేరుకున్నాయి. సహాయక సిబ్బంది మేన్యువల్​ డ్రిల్లింగ్​ ప్రక్రియ చేపట్టారు. మంగళవారం ఉదయానికి 51.5 మీటర్లు వరకు పూర్తి అయిన తవ్వకాలు. లోపల చిక్కుకున్న కార్మికులకు సహాయక సిబ్బంది 5 మీటర్ల దూరంలోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఇంకా చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 24 మంది నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిథిలాలను తొలగిస్తూ, సురక్షితమైన మార్గాన్ని డ్రిల్​ చేయడం కత్తిమీద సాములా మారిందని సమాచారం. ఎంత కష్టమైనా కార్మికుల దగ్గరకు చేరుకొని వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

అయితే, వాతావరణ పరిస్థితులు కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే జరిగితే.. సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇక కార్మికుల దగ్గరకు చేరుకున్న తర్వాత.. వారిని బయటకు తీసుకురావడం కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారికి హెల్మేట్లు, యూనిఫామ్​లు, మాస్క్​లు, గ్లాసెస్ రెడీ చేశారు. టన్నెల్​లో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి నుంచి ఈ విషయంలో జాగ్రత్తపడుతున్న అధికారులు.. ఓ పైప్​ ద్వారా ల్యాండ్​ లైన్​ని వారి వద్దకు పంపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు .. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు వారితో అధికారులు, వైద్యులు మాట్లాడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News