Big Stories

Beauty of Vanajangi : వనజంగి.. ముద్దాడే నింగి

Beauty of Vanajangi

Beauty of Vanajangi : ఎత్తైన కొండలు.. ఆ కొండలను తాకుతూ వెళ్లే మంచు మేఘాలు. ఆ మేఘాల మధ్యలో నుంచి ఉదయించే ఎర్రని సూర్యుడి అందం చెప్పతరం కాదు.. చూడతరమే. ఇదంతా కలలో కనిపించే మాయ కాదు.. ఇలలో కనిపిస్తున్న ‘వనజంగి’ అందాలు. మరి నింగిని ముద్దాడే ఈ వనజంగి ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతేంటో చూద్దాం రండి.

- Advertisement -

ఆంధ్రా కులుమనాలి
అది అల్లూరి సీతారామరాజు జిల్లా.. ప్రకృతి అందాలను తనలో దాచుకున్న మన్యం జిల్లా. విశాఖపట్నాకి 100 కి.మీ. దూరంలో.. పాడేరు మండలానికి 10 కి.మీ. దూరంలో ఉన్న ప్రకృతి సోయగాల నిధే ఈ వనజంగి. అతి తక్కువ కాలంలోనే ఫేమస్ అయిన ఈ వనజంగిని ‘ఆంధ్రా కులుమనాలి’గా పిలుచుకుంటారు.

- Advertisement -

ప్రకృతి అందాల సోయగం
సముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉండే వనజంగి అందాలను ఆస్వాదించాలంటే.. దాదాపు 5 కి.మీ. ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఒక్కసారి ఈ హిల్ ప్రాంతానికి చేరుకుంటే అక్కడ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడ రాత్రి స్టే చేసేందుకు ఫుడ్, టెంట్స్, క్యాంప్ ఫైర్స్ ఉంటాయి. ప్రకృతి ఒడిలో సేదతీరానులకునే ప్రేమికులకు బెస్ట్ లొకేషన్ ఈ వనజంగి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News