BigTV English

Financial Year : ఆర్థిక సంవత్సరం ఎక్కడ.. ఎలా?

Financial Year : ఆర్థిక సంవత్సరం ఎక్కడ.. ఎలా?

Financial Year : బడ్జెట్ వచ్చేస్తోందనగానే మనకి ‘ఏం లాభం’ అంటూ పలువర్గాలు లెక్కలు వేసుకోవటం సహజమే. అయితే.. మనకు కేలండర్ ఇయర్ ఉండగా.. మరి.. బడ్డెట్ ఇయర్ ఎందుకు? కేలండర్‌ ప్రకారం జనవరి 1 నుంచి కాకుండా ఏప్రిల్ 1 నుంచే బడ్జెట్ సంవత్సరాన్ని ఎందుకు పాటిస్తున్నాం? అన్ని దేశాల్లోనూ ఇదే పద్ధతి నడుస్తోందా? అనే ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.


ప్రభుత్వాలు లేదా సంస్థలు తమ ఆదాయం, ఖర్చు లెక్కలకు 12 నెలల సమయాన్ని ప్రమాణంగా తీసుకుంటాయి. ఈ విషయంలో కొందరు కేలండర్ సంవత్సరాన్ని ఫాలో అవుతుంటే.. మరికొందరు వేర్వేరు కాలాలను ఫాలో అవుతున్నారు. అయితే.. మన దేశంలో ఏప్రిల్ 1- మార్చి 31 మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నాం.

బ్రిటిష్ పాలకులు 1867 నుంచి ఏప్రిల్-మార్చి మధ్య కాలాన్నే బడ్జెట్ సంవత్సరంగా లెక్కించేవారు. స్వాతంత్ర్యం తర్వాత మనమూ దానినే ఫాలో అయ్యాం. అయితే దీనిని పక్కనబెట్టి.. జనవరి 1- డిసెంబర్ 31 లేదా నవంబరు 1-అక్టోబర్ 31 వరకు కాలాన్ని బడ్జెట్‌కు ప్రాతిపదికగా తీసుకోవాలని గతంలో ఓ డిమాండ్ రాగా, కేంద్రం దానిపై 1984 మేలో ఎల్ కే ఝా కమిటీని నియమించింది. ఆ కమిటీ.. జనవరి నుంచే ఆర్థిక సంవత్సరం మొదలైతే బాగుంటుందని సలహా ఇచ్చింది.


మనది వ్యవసాయ దేశం గనుక రుతుపవనాలు బాగుంటేనే మనకు పంటలు పండుతాయనీ, మనదేశంలో రుతుపవనాలు ముగిసే అక్టోబర్ నాటికి తగినంత వానలేకపోతే.. దిగుబడులు, ఆదాయం తగ్గి, బడ్జెట్ అంచనాలన్నీ తలకిందులయ్యే ప్రమాదం ఉంది గనుక ఆర్థిక సంవత్సర కాలాన్ని ముందుకు జరపాలని ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. అందుకే రుతుపవనాలు ముగిసిన వెంటనే బడ్జెట్‌ను సమర్పించే పక్షంలో విధానాల రూపకల్పనలో మార్పులు చేసుకునేందుకు తగిన సమయం ఉంటుందని ఝా కమిటీ వాదన.

అయితే..నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ వాదనను సమర్థించలేదు. ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అంశాల్లో రుతుపవనాలు ఒక అంశం మాత్రమేననీ, ఆర్థిక సంవత్సరాన్ని మార్చినంత మాత్రం పెద్దగా ఫలితం ఉండదని భావించి, ఝా కమిటీ సూచనలను పక్కనపెట్టి.. పాత విధానాన్నే కొనసాగించింది. కానీ అనంతర కాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం, రోజు మారాయి. 1999 నుంచి ఉదయం 11 గంటలకే బడ్జెట్‌ను సమర్పించే పద్ధతిని అమల్లోకి వచ్చింది. అలాగే 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీనే సమర్పించడం ఆరంభించారు.

ఇక.. ప్రపంచంలో పలు దేశాలు ఈ విషయంలో పలు విధానాలను అమలు చేస్తున్నాయి. బ్రిటన్‌లో ఏప్రిల్-మార్చి మధ్య కాలాన్ని బడ్జెట్ సంవత్సరంగా పరిగణిస్తున్నారు. ఇక.. నేపాల్‌లో జూలై 16 నుంచి జూలై 15 వరకు, సమోవాలో జూన్ 1 నుంచి మే 31 వరకు, ఇథియోపియా లో జూలై 8 నుంచి జూలై 7 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నారు.

అయితే.. ప్రపంచంలోని 143 దేశాల్లో ఆర్థిక సంవత్సరం జనవరి 1న మొదలై డిసెంబరు 31న ముగుస్తుంది. ఈ విషయంలో అఫ్ఘానిస్థాన్, ఇరాన్ తమ పర్షియన్ కేలండర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దాని ప్రకారం ఆ రెండు దేశాల్లో మార్చి 21 నుంచి మరుసటి మార్చి 20న ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.

మనతో సహా 18 దేశాలు ఏప్రిల్ 1- మార్చి 31 మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తున్నాయి. అమెరికా సహా 9 దేశాల్లో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1న ఆరంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఆస్ర్టేలియా, పాకిస్థాన్ సహా 15 దేశాలు జూలై 1- జూన్ 30 వరకు కాలాన్ని బడ్జెట్ సంవత్సరంగా పరిగణిస్తున్నాయి.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×