BigTV English

Sudha Murthy : ది గ్రేట్ సుధామూర్తి.. 20 ఏళ్లుగా ఒక్కచీర కూడా కొనలేదు.. ఎందుకు ?

Sudha Murthy : ది గ్రేట్ సుధామూర్తి.. 20 ఏళ్లుగా ఒక్కచీర కూడా కొనలేదు.. ఎందుకు ?

Sudha Murthy : భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో సుధామూర్తి ఒకరు. ఇన్ఫోసిస్ యజమాని అయిన ఆమె 20 ఏళ్లుగా తన కోసం ఒక్కచీర కూడా కొనుక్కోలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. అలాగని ఆమె కొత్తచీరలు కట్టుకోరా అంటే.. కట్టుకుంటారు. కానీ.. అవి ఆమె కొనుక్కున్నవి కాదు. ఆమె సోదరి, సన్నిహితులు, బంధువులు, ఎన్జీఓలు బహుమతులుగా ఇచ్చిన చీరలు మినహా.. సొంతంగా తనకోసం చీరకొనుగోలు చేసేందుకు ఖర్చు చేయరు. షాపింగ్ అంటే ఎంతో ఇష్టపడే సుధామూర్తి.. ఈ విషయంలో ఎందుకిలా ఉన్నారన్న అనుమానం ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. సుధామూర్తి 100 శాతం నో షాపింగ్ పాలసీని ఫాలో అవ్వడానికి కారణం వారణాసిలో ఆమె చేసిన ప్రతిజ్ఞ.


ది వాయిస్ ఆఫ్ ఫ్యాషన్ మ్యాగజైన్ ప్రకారం.. ఒకప్పుడు షాపింగ్ అంటే సుధామూర్తికి ఎంతో ఆసక్తి ఉండేది. కానీ.. వారణాసి పర్యటనలో బతకడానికి కావలసిన ఆహారం, నీరు, మందులు వంటి ప్రాథమిక అవసరాలు మినహా అన్ని షాపింగ్ లను వదులుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. కాశీకి వెళ్లినపుడు మీకు బాగా నచ్చినదానిని వదులు కోవాలని అంటారు కదా. అలాగే సుధామూర్తి తనకెంతో ఇష్టమైన షాపింగ్ ను జీవితకాలం వదులుకుంటానని అనుకున్నారట. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె తనకోసం షాపింగ్ చేయలేదు.

తన తల్లి మరణించినపుడు ఆమెకు సంబంధించిన వస్తువులను ఇచ్చేందుకు తమకు కేవలం అరగంట సమయం మాత్రమే పట్టిందన్నారు. ఎందుకంటే ఆ అల్మారాలో కేవలం 8-10 చీరలు మాత్రమే ఉన్నాయి. 32 సంవత్సరాల క్రితం ఆమె అమ్మమ్మ చనిపోయేసమయానికి కేవలం 4 చీరలు మాత్రమే ఉన్నాయట. దీనిని బట్టి చూస్తే.. కనీస అవసరాలతో చాలా సరళంగా జీవించవచ్చని తెలిసిందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధామూర్తి తెలిపారు.


ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, తన భర్త అయిన నారాయణ మూర్తి తమ పెళ్లి సమయంలో తమకు కేవలం రెండు చీరలు మాత్రమే ఇచ్చారని, అవి తనకెంతో ఆనందాన్నిచ్చాయన్నారు. ఈ రోజుల్లో ఫ్యాషన్ డిజైనర్ల నుండి సీజనల్ ట్రెండ్‌లు, సీజనల్ కలెక్షన్‌లను అర్థం చేసుకోవడం తనకు చాలా కష్టంగా ఉందంటారు. ఈ ఫ్యాషన్ ను ఎంతకాలం పాటించగలరో అర్థం కాదన్నారు. మనిషి హుందాగా జీవించాలంటే వేలకు వేలు ఖర్చుచేసి కొన్న బట్టల్నే ధరించనక్కర్లేదన్నది సుధామూర్తి పాలసీ. సుధామూర్తి షాపింగ్ చేయడం మానేసిన తర్వాత.. ఆమె సోదరీమణులు ప్రతి సంవత్సరం ఆమెకు రెండు చీరలను బహుమతిగా ఇస్తూ వస్తున్నారు. ఆ బహుమతులు కూడా తనకు చాలా ఎక్కువేనంటారు. ఇప్పటికే తనవద్ద అవసరానికి మించిన చీరలున్నాయని చెబుతారు.

ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఖరీదైన చీరలు కొనాలన్న ఫ్యాషన్ పెరిగింది. అవసరానికి, పండుగకు, ఫంక్షన్ కు కావలసిన చీరలు కొనుక్కుంటే చాలు.. చాలా ఖర్చును తగ్గించుకోవచ్చన్నది సుధామూర్తి ఆలోచన. ఈ సింపుల్ టిప్ ను మధ్యతరగతి కుటుంబాలు పాటిస్తే.. ఉన్నంతలోనే ఎంతో హ్యాపీగా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. ఆలోచించండి మరి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×