BigTV English

Vidushi Swaroop : ఆ వృత్తిలో ఫ్రెషర్స్‌కి భలే డిమాండ్.. స్టాండ్ అప్ కమెడియన్ వ్యాఖ్యలపై వివాదం

Vidushi Swaroop : ఈ రోజుల్లో ఎంటర్‌టైన్మెంట్ పేరుతో యూట్యూబ్, ఇతర ప్లాట్‌ఫామ్స్‌పై స్టాండప్ కామెడీ బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా నగరవాసులు, యువత ఈ కామెడీని భలేగా ఇష్టపడుతున్నారు. స్టాండప్ కామెడీ వీడియోలను యువత తెగ ఎంజాయ్ చేస్తూ ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు.

Vidushi Swaroop : ఆ వృత్తిలో ఫ్రెషర్స్‌కి భలే డిమాండ్.. స్టాండ్ అప్ కమెడియన్ వ్యాఖ్యలపై వివాదం

Vidushi Swaroop : ఈ రోజుల్లో ఎంటర్‌టైన్మెంట్ పేరుతో యూట్యూబ్, ఇతర ప్లాట్‌ఫామ్స్‌పై స్టాండప్ కామెడీ బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా నగరవాసులు, యువత ఈ కామెడీని భలేగా ఇష్టపడుతున్నారు. స్టాండప్ కామెడీ వీడియోలను యువత తెగ ఎంజాయ్ చేస్తూ ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు.


కానీ కొన్ని సార్లు స్టాండప్ కామెడీ చేసే వ్యక్తులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. నైతిక విలువలు పాటించక.. హాస్యం కోసం చెప్పకూడని విషయాలు చెబుతున్నారు. అలాంటి వారిని నెటిజన్లు బాగా ట్లోల్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీివలే జరిగింది.

విదూషి స్వరూప్ అనే యువతి స్టాండప్ కమెడియన్ బాగా ఫేమస్. ఆమె తన ప్రోగ్రామ్స్ ద్వారా కడుపుబ్బా నవ్విస్తుంటారు. అయితే ఆమె ఇటీవల చేసిన ఒక స్టాండప్ కామెడీ ప్రొగ్రామ్‌ పెద్ద వివాదాస్పదమైంది. ఆమె తెలిసి అన్నారో.. లేక హాస్యం పండించాలని అలా సరదాగా అన్నారో తెలియదు కాని.. మహిళలను కించపరిచే విధంగా కొన్ని వాఖ్యలు చేశారు. వ్యభిచార వృత్తి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజెన్లు, కొందరు ప్రజా ప్రతినిధులు ఆమెను తిట్టిపోస్తున్నారు.


ఇంతకీ ఆమె చెప్పిందంటే.. వ్యభిచారం ఓ కూల్ ప్రొఫెషన్. ఈ వృత్తిలో సీనియర్ల కంటే ప్రెషర్స్‌కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సీఈవో కంటే ఇంటర్న్స్ ఇక్కడ ఎక్కువ సంపాదిస్తారు అంటూ విదుషి తనదైన శైలిలో హాస్యం పండించేందుకు ప్రయత్నించింది. ఆమె వ్యాఖ్యలు అక్కడున్న వారికి విపరీతంగా నవ్వు తెప్పించాయి. ఆ కామెడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.

విదూషి చేసిన కామెడీ వీడియోకు ట్విటర్‌లో లక్షల వ్యూస్ వచ్చాయి. విదుషి వ్యాఖ్యలను కొందరు లైట్ తీసుకుంటుంటే.. మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి షోలను చూడడానికి వెళ్లేవారు అలాంటివి ఎలా భరిస్తున్నారో, అని ఒకరంటే.

మరొకరు వ్యభిచారం కూల్ కాదు.. "అక్కడ ఎంత కష్టం, అవమానాలు, కన్నీళ్లు ఉంటాయో ఎవరికీ తెలియదు,” అని స్పందించారు. ఇంకొకరైతే.. “అలాంటప్పుడు ఆమె కామెడీని వదిలి వ్యభిచార వృత్తిలో ఉండాలి”, అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×