E-Paper
Advertisement

భర్తపై ద్వేషం-ప్రియుడిపై ప్రేమ.. భార్య ఏం చేసిందో తెలుసా? విద్యుత్ షాక్ ఇచ్చి.. ఢిల్లీలో దారుణం

భర్తపై ద్వేషం-ప్రియుడిపై ప్రేమ.. భార్య ఏం చేసిందో తెలుసా? విద్యుత్ షాక్ ఇచ్చి.. ఢిల్లీలో దారుణం
Advertisement

Delhi: ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి ప్రేమలో పడి రెండు దశాబ్దాల భర్తతో బంధాన్ని ద్వేషించుకుంది. చివరకు తాడుతో భర్త గొంతు నులిమి, విద్యుత్తు షాకులిచ్చి చంపేసింది కట్టుకున్న భార్య. ఈ వ్యవహారం అంతా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి రావడంతో అడ్డంగా దొరికిపోయింది సదరు మహిళ. సంచలనం రేపిన ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో వెలుగు చూసింది.

 

ఢిల్లీలో దారుణమైన ఘటన

Advertisement

దక్షిణ దిల్లీలోని సంగమ్‌ విహార్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది ఓ ఫ్యామిలీ. భర్త మున్నాలాల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటు కాగా, భార్య నజియా గృహిణిగా ఉంటోంది. వీరికి వివాహం జరిగింది దాదాపు 22 ఏళ్లు అయ్యింది. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. భర్త తన పనుల నిమిత్తం పగలు అంతా బయట ఉండేవాడు. సాయంత్రం లేదా రాత్రి వేళ ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో చమన్ అనే వ్యక్తి మోజులో పడింది నజియా. చివరకు భర్తపై ద్వేషం పెంచుకుంది, ప్రియుడి చమన్‌పై ప్రేమను రెట్టింపు చేసుకుంది.

 

ప్రియుడి ప్రేమ.. 22 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్

Advertisement

సీన్ కట్ చేస్తే.. సోమవారం తెల్లవారుజామున తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు మున్నాలాల్. దీంతో బెదిరిపోయిన అతడి భార్య నజియా పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఓ దొంగ ఇంట్లోకి చొరబడి ఇల్లంతా చిందరవందర చేసి, మున్నాను చంపేశాడని చెప్పింది. ఆ సమయంలో ఆమెని గమనించారు పోలీసులు. ఆమె తీవ్రంగా కుంగుబాటుకు గురైనట్లు కనిపించింది. ఈ ఘటన సమయంలో ఇంట్లో వారి కొడుకు, కూతురు లేరు. కన్వర్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లాడు.

 

గుట్టుంతా సీసీటీవీ కెమెరాలో, విద్యుత్ షాక్ ఇచ్చి మరీ

ఆమె ఇచ్చిన ఆధారాలతో రంగంలోకి దిగారు పోలీసులు. భార్య వ్యవహారశైలిని గమనించిన మున్నా, తన ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. ఆ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో ముసుగు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్టు ఉంది. మళ్లీ 3.15 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లడం కనిపించింది. చివరకు బాధితురాలి కుటుంబ సభ్యుల కాల్ వివరాలను పరిశీలించారు. నజియా ఓ వ్యక్తితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తి చమన్‌ అని గుర్తించారు.

దీంతో నజియాను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ప్రియుడి సాయంతో అత్యంత కిరాతకంగా భర్తను హత్య చేసింది భార్య. తాడుతో మున్నాలాల్ గొంతు నులిమి, ఆ తర్వాత విద్యుత్తు షాకు ఇచ్చారు. ఆధారాలు లేకుండా కర్రతో కొట్టి హత్య చేశారు. పోలీసుల దర్యాప్తులో నజియా తన ప్రియుడు చమన్‌తో కలిసి తన భర్తను హత్య చేయడానికి ప్లాన్ చేసిందని నిర్ధారించారు.

ALSO READ: నీట్ లీకేజీ కేసులో కదిలిన డొంక, 20 వేల పేజీలతో సీబీఐ ఛార్జిషీట్

తాగునీటిలో మత్తు మందు కలిపి ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక హత్య చేసినట్లు అంగీకరించింది. భర్తను చంపితే డబ్బులు ఇస్తానని నాజియా..  తన ప్రియుడు చమన్‌ కు చెప్పింది. అన్నట్లుగానే రూ.20 వేలు ఇచ్చింది. ఈ హత్యకు మరో వ్యక్తి కూడా సహకరించారు. చివరకు మొత్తం నజియా, ఆమె ప్రియుడు చమన్, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

Related News

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం.. 27 ఏళ్ల సుదీర్ఘ పోరాటం

Big Stories

Advertisement
×