Ninnu kori serial today Episode: నిద్ర లేచిన విరాట్ తన చుట్టు ఉన్నవాళ్లు వేరు నా గతంలో ఉన్న వాళ్లు వేరు అన్నట్టు ఉంది అని చెప్తాడు. అయితే మీరేం ట్రెస్ ఫీల్ అవ్వొద్దని గుర్తుకు వచ్చే టైంకు అన్ని గుర్తుకు వస్తాయని అప్పటి వరకు బలవంతంగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయకండి ముందు మీరు కళ్లు మూసుకోండి.. గట్టిగా బ్రీప్ తీసుకోండి.. అంటూ విరాట్‌కు చెప్పగానే.. చంద్ర చెప్పినట్టు చేసిన విరాట్ ఇప్పుడు చాలా రిలీఫ్‌గా ఉంది అంటాడు. అప్పుడే కేశవ వస్తాడు. నువ్వేం ఫీల్ అవకు చంద్ర చెప్పింది కరెక్టు నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచించకు అంటూ చెప్తాడు. శ్రీజ గురించి చెప్తాడు కేశవ. చిన్నప్పటి నుంచి నీ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతుంది. నీకు ఏమీ గుర్తుకు రాకుండా పెళ్లి చేయమని అలా చేస్తే.. శ్రీజకు అన్యాయం చేసిన వాళ్లం అవుతాం అంటాడు. చంద్రకు కూడా ఈ ఇంట్లో నీకు ఏ ఇబ్బంది వచ్చినా నన్ను అడుగమ్మా నీకు ఏ అవసరం వచ్చినా నేను తీరుస్తాను అంటూ వెళ్లిపోతాడు కేశవ.
అందరూ భోజనం చేస్తుంటే.. నీలగిరి ఏదేదో మాట్లాడుతుంటే.. జీవన్ సెటైర్లు వేస్తాడు. అప్పుడే సామ్రాట్ భోజనానికి వస్తాడు. దాక్షాయణి చంద్రను పిలిచి సామ్రాట్‌కు ఏమేం కావాలో చూసుకోమని చెప్తుంది. సరే అంటుంది చంద్ర. అప్పుడే శ్రీజ వచ్చి అందరికీ వడ్డిస్తుంది. స్పెషల్‌గా మదన్‌కు వడ్డించి తినండి మదన్ గారు తిని ఎలా ఉందో చెప్పండి అంటుంది. దాక్షాయణి మాత్రం అదేంటే మీ బావకు వడ్డించలేదు అని అడగ్గానే.. ఆయన ఫుడ్డు సెటప్ అంతా వేరే కదా పైగా ఆయనకు నేను గుర్తే లేను నేను ఎందుకు వడ్డించాలి అంటుంది.
కేశవ అలిగావా..? అని అడిగితే.. అలుగా ఆయన గారు కాదంటే అలగాలా..? అంటుంది. అన్నయ్య గతమే మర్చిపోయాడు.. దీనికి చిప్పే దొబ్బేసినట్టు ఉంది అంటాడు జీవన్. గిరిజ కోపంగా చూస్తూ.. శ్రీజ వెళ్లి మీ బావ పక్కన కూర్చో అని చెబితే.. బావ పక్కనే కూర్చోవాలా…? అంటూ మదన్ పక్కన కూర్చుని మదన్ గారు మీరు పరాయి వారు కాదని మామయ్య చెప్పారు కాబట్టి మొహమాట పడకుండా తినేయండి అంటుంది. మదన్ చెవిలో చిన్నగా మీరు చెప్పింది నిజమే మదన్ గారు బావ నన్నే చూస్తున్నాడు అంటూ గుసగుసలాడుతుంది. నీలగిరి, గిరిజ కోపంగా శ్రీజను చూస్తుంటారు.
తర్వాత చంద్ర మదన్ దగ్గరకు వెళ్లి శ్రీజను ఏం చేశావని ఒక్క రోజులోనే విరాట్ నుంచి నీవైపు డైవర్ట్ అయిపోయింది అని అడుగుతుంది అవన్నీ సీక్రెట్ అని చెప్పకూడదని అంటాడు మదన్. కాకపోతే చిన్న మ్యాజిక్ చేశాను. అదెలా వర్కవుట్ అయిందో చూశారా..? ఇకపై మీకు విరాట్‌కు మధ్యలో ఎవ్వరూ రారు ఇక శ్రీజ నాది అని చెప్తాడు. చంద్ర ఆశ్చర్యంగా ఏంటి నీదా..? అంటే.. నాది అంటే మీకు ఆల్‌రెడీ చెప్పాను కదండి శ్రీజను చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయని అంటాడు. చంద్ర నవ్వుతూ.. మీరు నాకోసం ఈ ఇంటికి వచ్చారు.. కానీ మీకోసం ఆ దేవుడే మీకు ఇక్కడ పార్ట్‌నర్ ను క్రియేట్ చేశాడు అంటూ చంద్ర నవ్వుతుంది. నవ్వకండి చంద్ర గారు మీరు కూడా కాస్త హెల్ప్ చేయాలి నాకు అంటూ మదన్ చెప్పగానే.. సరే అంటూ వెళ్లిపోతుంది చంద్ర.
రూంలో కూర్చుని రైస్‌మిల్లు లెక్కలు చూస్తున్న దాక్షాయణి నీలగిరిని పిలుస్తుంది. అప్పుడే జీవన్ వస్తాడు. తాను పిలిచింది మా అన్నయ్యను అంటూ తిడుతుంటే.. నీలగిరి వస్తాడు. రైస్‌మిల్లులో రేపు జీతాలు ఇవ్వాలి నాకు గుర్తు చేయోచ్చు కదా అంటూ డబ్బులు తీసి నీలగిరికి ఇస్తుంది. జీవన్ తన ప్యాకెట్ మనీ ఇవ్వమని అడిగితే.. చిల్లిగవ్వ కూడా ఇవ్వనని ఏం చేసుకుంటావో చేసుకోమని వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటప్పుడు కనడం దేనికో అంటూ జీవన్ వెళ్లిపోతాడు. జీవన్‌ను నీలగిరి తిడతాడు. దాక్షాయణి కోపంగా చూస్తుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.