E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి పోటీగా జ్యోత్స్నను రంగంలోకి దింపిన దీప     

Karthika Deepam 2 Serial Today Episode August 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి పోటీగా జ్యోత్స్నను రంగంలోకి దింపిన దీప     
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  కార్తీక్‌ వాళ్ల ఇంట్లోంచి ఇంటికి వెళ్లడానికి బయటకు వెళ్లిన జ్యోత్స్న క్యాబ్‌ బుక్‌ చేస్తుంటే.. ఒక్క క్యాబ్‌ బుక్‌ కాదు. ఇంతలో సూరజ్‌ స్కూటీ మీద వస్తాడు. సూరజ్‌ను చూసి కోప్పడుతుంది జ్యోత్స్న. తాను స్కూటీ ఎక్కనని చెప్తుంది. సూరజ్‌ తన మాటలతో జ్యోత్స్నను కన్వీన్స్‌ చేసి స్కూటీ మీద ఎక్కించుకుని వెళ్లిపోతాడు. ఇంటి దగ్గర డ్రాప్‌ చేశాక జ్యోత్స్న థాంక్స్‌ చెప్పగానే.. సూరజ్‌ ఆగమని నీ మనసులో ఎవ్వరికీ స్థాన లేదని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నావు అంటాడు.

నా మనసులో ఎవ్వరికీ స్థాన లేదు నేను ఎవ్వరికీ స్థానం ఇవ్వను అనగానే.. నీ మనసులో నీకు కూడా స్థానం లేదా.? అంటూ సూరజ్‌ అడగ్గానే.. జ్యోత్స్న కోపంగా నువ్వేం అడగాలనుకుంటున్నావో ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం అవుతుందిరా ఒకప్పుడు మా బావంటే చాలా ఇష్టం.. ప్రాణం కూడా అందుకే మా బావ ఇచ్చిన వస్తువులన్నీ నా దగ్గరే జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇప్పుడు అ ప్రేమ పోయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే మా బావ మీద ఉన్నది ప్రేమ కాదు.. పంతం అని అర్థం అయింది. అందుకే బావ ఇచ్చిన వస్తువులు తిరిగి ఇచ్చేశా అని చెప్పగానే.. సూరజ్‌ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగితే.. తన మనసులో ఎవ్వరికీ స్థానం లేదని చెప్తున్నాను అంటుంది జ్యోత్స్న.

Advertisement

మరుసటి రోజు ఉదయమే కార్తీక్‌, దీప ఇంటికి వస్తారు. సుమిత్ర సూరజ్‌ను పిలిచి జ్యోత్స్న టైంకు భోజనం చేయడం లేదు.. నిద్రపోవడం లేదు.. ఎవ్వరితో సరిగ్గా మాట్లాడటం లేదు.. నీవల్లే అది అలా తయారయింది అని చెప్పగానే.. నా వల్లా అయితే నేను ఒక మాట అడుగుతాను అంటూ సూరజ్‌ అనే వాడిని పక్కన పెట్టండి జ్యోత్స్న మనసులో కార్తీక్‌ గారు ఉన్నారని మీకు తెలుసు. ఎందుకంటే వాళ్లిద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారు.. కానీ కార్తీక్‌ గారు దీప మెడలో తాళి కట్టాక జ్యోత్స్న మీరు మార్చలేకపోయారు అంటూ చెప్తుంటే..

దశరథ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగితే.. మీరు ఇన్ని రోజులు మనిషిని మార్చాలని చూశారు. కానీ మనసును మార్చాలనుకోలేదు అంటాడు. రెండు ఒకటే కదా సూరజ్‌ అని దశరథ అడిగితే రెండు ఒకటే కాదు అంటాడు సూరజ్‌. మనసును మార్చడం అంటే ఇదేనా జ్యోత్స్న ఏడుస్తుంది అది నీకు కనబడుతుందా..? అని దీప అడిగితే.. మీరు జ్యోత్స్నలో చూస్తున్న ఏడుపు కూడా మార్పే.. నేను కోరుకున్న విధంగా తాను మారినరోజు మీరు ఎవ్వరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసిపోతుంది.. జ్యోత్స్నతో జీవితాంతం కలిసి బతికే ప్రేమ నాలో ఉంది అంటూ సూరజ్‌ చెప్తుంటే.. పై నుంచి జ్యోత్స్న వింటుంది.. ఏదో ఆలోచిస్తూ లోపలికి వెళ్లిపోతుంది.

Advertisement

గౌరిప్రసాద్‌ రెస్టారెంట్‌ అమ్ముతున్నాడని తెలసి కొనడానికి శివనారాయణ, కార్తీక్‌, దీప, జ్యోత్స్న, సూరజ్‌ వెళ్తారు. గౌరి ప్రసాద్‌ మీకు అమ్మలేనని.. దక్షిణమూర్తికి మాటిచ్చానని చెప్తాడు. అప్పుడే దక్షిణమూర్తి, మాలిని వస్తారు. వెంటనే డబ్బులు ఇస్తామని అగ్రిమెంట్‌ రాసుకుందామని చెప్తాడు దక్షిణమూర్తి. గౌరి ప్రసాద్‌ నిబంధనలు చెప్పగానే.. మాలిని ఆలోచిస్తుంది. శివనారాయణ మాత్రం నిబంధనలకు ఓకే నాకు ఈ రెస్టారెంట్ కావాలి నేను బయట ఉంటాను మీరు డీల్‌ ఓకే చేసుకోండి అంటూ వెళ్తాడు. దక్షిణమూర్తి కూడా మాలిని అగ్రిమెంట్‌ చేసుకుని రా నేను బయట ఉంటాను అంటూ వెళ్తాడు. కార్తీక్‌ చెప్పిన ఐడియా ప్రకారం స్టాప్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయమని చెప్తుంది మాలిని.

బయటకు వెళ్లిన దక్షిణమూర్తి, శివనారాయణ మధ్య మాటల యుద్దం జరుగుతుంది. రెస్టారెంట్‌ విషయంలో ఇద్దరూ తామే గెలుస్తామని ధీమాగా ఉంటారు. లోపల స్టాప్‌ను పిలిచిన గౌరి ప్రసాద్‌ విషయం చెప్పి ఓటింగ్‌ గురించి చెప్తాడు. వచ్చిన స్టాప్ కు  మాలిని తాను రెస్టారెంట్‌ కొంటే మిమ్మల్ని జాబ్‌ నుంచి తీసేస్తానని కానీ ఒక్కోక్కరికి ఐదు లక్షలు ఇచ్చి తీసేస్తానని చెప్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని చెప్పగానే.. గౌరి ప్రసాద్‌ కూడా దీపను ఏదైనా చెప్తారా..? అని అడిగితే.. దీప కంపెనీ తరపున మాట్లాడమని జ్యోత్స్నకు చెప్తుంది. నీకు అండగా సూరజ్‌ ఉన్నాడని నువ్వు శివనారాయణ గారి మనవరాలివని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

బిగ్ బాస్ వెళ్ళిందే వాళ్ళ కోసం.. ఎలిమినేషన్ పై కన్నీళ్లు పెట్టుకున్న చైత్ర!

ఇండస్ట్రీలోకి రాకపోయుండుంటే చైత్ర రాయ్ ఏం చేసేవారో తెలుసా?

ఎట్టకేలకు లవ్ లో పడ్డ గల్లీ బాయ్ భాస్కర్.. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ!

బిగ్ బాస్ 10 సుధీర్ బర్త్డే.. గొప్ప పనికి శ్రీకారం చుట్టిన ఫ్యాన్స్!

ముఖేష్ కెప్టెన్సీ ఉష్.. కొత్త కెప్టెన్ గా అపూర్వ.. అప్పుడే మొదలుపెట్టేసిందే?

అలాంటి అమ్మాయే భార్యగా రావాలంటున్న బిగ్ బాస్ పవన్.. గొప్ప కోరికే!

Big Stories

Advertisement
×