NO INDIA Vs PAKISTAN IN ASIAN GAMES: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( INDIA Vs PAKISTAN) మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే, జనాలందరూ టీవీలకే అతుక్కుపోతూ ఉంటారు. ఇక ఆదివారం ఈ రెండు జట్లు తలపడితే… కోట్ల వర్షం కురవడం గ్యారంటీ. అందుకే ఐసీసీ ఏదైనా టోర్నమెంట్ నిర్వహిస్తే.. కచ్చితంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించి, క్యాష్ చేసుకుంటుంది.
అయితే త్వరలో జరగబోయే ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( ASIAN GAMES 2026) సందర్భంగా కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందని మొన్నటి వరకు ప్రచారం జోరుగా సాగింది. దీంతో జనాలు సంబరపడ్డారు. అయితే ఈ సంబరాలు మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు లేనట్లేనని నివేదికలు చెబుతున్నాయి. ఐసీసీ తరహాలో ఏషియన్ గేమ్స్ లో గ్రూప్స్ సిస్టం లేదు. ఈ క్రమంలో మొదటి దశలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం కష్టమేనని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.
ఐసీసీ, ACC ఈవెంట్స్ లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇలా క్రేజ్, ఆదాయం కోసం ఇరు జట్లను ఒకే గ్రూపులో వేసి… మ్యాచ్ లు నిర్వహిస్తారు. కానీ ఏషియన్ గేమ్స్ రూల్స్ అలా లేవు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియా, పాకిస్తాన్ జట్లు వేరువేరు వైపులా ఉంచబడ్డాయి. అంటే ఇక్కడ గ్రూప్స్ ఉండవు. మెరుగైన ర్యాంకింగ్స్ ఉన్న నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అలాగే శ్రీలంక పురుషుల జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ అర్హత సాధించాయి. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, హాంకాంగ్ లాంటి చిన్నచితక జట్లు ప్రిలిమినరీ రౌండ్ ఆడి, క్వార్టర్ ఫైనల్స్ చేరతాయి. ఇక క్వార్టర్ ఫైనల్స్ చేరిన జట్లతో టీమిండియా, అటు పాకిస్తాన్ వేరు, వేరుగా తలపడతాయి. ఇక్కడ రెండు జట్లు తమ సెమీ ఫైనల్స్ కూడా గెలిస్తే… ఫైనల్ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుందన్నమాట.
ఫైనల్స్ లో గెలిస్తే గోల్డ్ మెడల్ సాధిస్తారు. ఒకవేళ సెమీ ఫైనల్స్ లో ఓడితే.. అదే రోజున కాంస్యం కోసం జరిగే మూడో స్థానం మ్యాచ్ లో రెండు జట్లు తలపడే ఛాన్సులు ఉన్నాయి. మహిళల క్రికెట్ లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే అది ఫైనల్ లేదా, కాంస్య పతకం పోరులోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నాగోయా వేదికగా జరుగుతాయి.
క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు ఉండనున్నాయి. టి 20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరుగుతాయి కాబట్టి… శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా బరిలో దిగుతుంది. ఏషియన్ గేమ్స్ లో టీమిండియాతో మ్యాచ్ లేకపోవడంతో పాక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవేళ టీమిండియాతో మ్యాచ్ లు పడితే, కచ్చితంగా పాక్ ఓడిపోతుంది. దాంతో తమ పరువు పోతుందని, కానీ ఇప్పుడు ఏషియన్ గేమ్స్ రూల్స్ తమను కాపాడాయని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.