BigTV English

Arrow Shot: దారుణం.. మహిళా ఎస్సై తలలోకి బాణాన్ని దించిన దుండగులు

Arrow Shot: దారుణం.. మహిళా ఎస్సై తలలోకి బాణాన్ని దించిన దుండగులు

woman cop shot in face with arrow: భూ వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పలువురు అల్లరి మూకలు పోలీసులపై దాడి చేశారు. బాణాలతో దాడి చేయడంతో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళా ఎస్సై తలలో నుంచి బాణం దూసుకెళ్లింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.


Also Read: నా కొడుకు చదువు కోసం డబ్బుల్లేక చాలామందిని అడగాల్సి వచ్చింది: మనీశ్ సిసోడియా

ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వస్తున్న వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని జోకిహాట్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు భూ వివాదమై ఘర్షణ పడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నవారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేశారు.


ఈ క్రమంలో వారు పోలీసులపై దాడి చేశారు. 200 మంది వరకు ఉన్నవారు బాణాలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓ మహిళా ఎస్సై తలలోంచి బాణం దూసుకెళ్లింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, సదరు బాధితురాలు మహల్ గావ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రమేయమున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారంటూ ఆ కథనాల్లో పేర్కొన్నారు.

Also Read: ఓరి మీ దుంపల్ తెగ.. ఇవేం పనులు రా.. పంజాబ్ లో రైలు పట్టాలపై రాడ్లు

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×