BigTV English

Manish Sisodia: నా కొడుకు చదువు కోసం డబ్బుల్లేక చాలామందిని అడగాల్సి వచ్చింది: మనీశ్ సిసోడియా

Manish Sisodia: నా కొడుకు చదువు కోసం డబ్బుల్లేక చాలామందిని అడగాల్సి వచ్చింది: మనీశ్ సిసోడియా

Manish Sisodia Recounts time after arrest: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై దాదాపు 17 నెలలు జైలులో ఉండి, బెయిల్ పై విడుదల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామంటూ బెదిరించారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆప్ ఆధ్వర్యంలో ఆదివారం ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తాను అనుభవించిన జైలు జీవితం, అందులో తాను అనుభవించిన కష్టాల గురించి గుర్తుచేసుకున్నారు.


Also Read: పని ఒత్తిడి వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?..

‘జైలులో నేను తీవ్రమైన బాధలు అనుభవించాను. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నన్ను కావాలనే ఇరికించారు. ఇటు జైలులో కూడా నన్ను బెదిరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాలే నా పేరు చెప్పి ఇరికించారంటూ చెప్పి నన్ను నమ్మించేందుకు తెగ ప్రయత్నించేవారు. కోర్టు ముందు కేజ్రీవాల్ గురించి చెబితే నన్ను ఈ కేసులో నుంచి కాపాడుతామంటూ బెదిరించారు. ఆప్ కు రాజీనామా చేయాలన్నారు. పార్టీ మారకపోతే నన్ను జైల్లోనే చంపేస్తామంటూ బెదిరించారు. నన్ను బీజేపీలో చేరాలన్నారు. లేకపోతే ఒత్తిడిలు తప్పవంటూ నన్ను తెగ బెదిరించారు.


ఇదంతా కూడా ఎక్కడో కాదు.. జైలులోనే నన్ను మానసికంగా కుప్పకూల్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బీజేపీ చేరకుంటే చంపేస్తామంటూ కూడా బెదిరించారు. అనారోగ్యంతో ఉన్న నీ భార్య గురించి, కుమారుడి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ బెదిరించారు. నువ్వు చనిపోతే నీ గురించి ఆలోచించేవారు ఎవరూ లేరంటూ చెప్పేవారు. నాపై ఒత్తిడి పెంచేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారి ఒత్తిళ్లకు నేను ఏనాడు తలొగ్గలేదు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఢిల్లీలో మళ్లీ ఆపే విజయం సాధిస్తుంది. కేజ్రీవాలే మరోసారి సీఎం అవుతారు.

Also Read: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

నేను జైలులో ఉన్నప్పుడు నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతోపాటు ఎన్నో బాధలు పడ్డారు. నేను జర్నలిస్టుగా పని చేసిన సమయంలో 2002లో రూ. 5 లక్షలతో ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేశా. దానితోపాటు నా బ్యాంకు ఖాతాలో రూ. 10 లక్షలు జమ చేసుకున్నాను. వాటిని నా కుమారుడి ఫిజు కోసం దాచాను. ఈ వివరాలన్నిటినీ ఈడీకి తెలియజేశాను. అయినా కూడా ఈడీ నా అకౌంట్ ను స్తంభింపజేసింది. ఆ సమయంలో ఫిజు కోసం చాలామందిని సహాయం అడగాల్సి వచ్చింది’ అంటూ సిసోడియా అన్నారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×