BigTV English

Virat Kohli: జీవితంలో కష్టసుఖాలను గౌరవించాలి: విరాట్ కొహ్లీ

Virat Kohli: జీవితంలో కష్టసుఖాలను గౌరవించాలి: విరాట్ కొహ్లీ

Virat Kohli: లోకంలో పగలు, రాత్రి ఉన్నట్టే.. ప్రతి మనిషి జీవితంలో చీకటి ఉంటుంది. వెలుతురు ఉంటుంది.. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుందని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ అన్నాడు. ఇలాంటివి ఎదురైనప్పుడు ప్రతీ దశను గౌరవించుకుంటూ ముందుకు వెళ్లడమేనని అన్నాడు. అయితే ఆ పరిస్థితుల్లో మరింత కష్టపడాలి. నిరంతరం శ్రమించాలని తెలిపాడు.


ఇటీవల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కొహ్లీ తన మనసులోని భావాలు వ్యక్తీకరించాడు. అన్నింటికి మించి తనలో ఇప్పుడు వేదాంత భావాలు ఎక్కువయ్యాయి. పెళ్లయిన తర్వాత అనుష్క సహచర్యంలో కొంత ఆధ్యాత్మిక భావ సంపద ఎక్కువైందనే చెప్పాలి. అదే ప్రతీ అంశానికి ముడి పెట్టి కర్మ సిద్ధాంతం పేరుతో చెబుతున్నాడు.

జీవితంలో లేదా కెరీర్ లో ఏం జరిగినా మన మంచికే. ఏం జరిగినా పాజిటివ్ గా తీసుకోవాలి. ఏం జరిగినా కుంగిపోకూడదు.. లాంటి కొటేషన్లు ఎక్కువగా వాడుతున్నాడు.


ఇంతకీ విషయం ఏమిటంటే.. తన కెరీర్ గురించి మాట్లాడుతూ క్రికెట్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని అన్నాడు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరంగా ఉండటం చాలా ముఖ్యమని అన్నాడు. ఇదే నేను నేర్చుకున్నదని తెలిపాడు. ఏదీ మన చేతుల్లో లేనప్పుడు ఎలా స్పందిస్తాం చెప్పమని తిరిగి ప్రశ్నించాడు.

Also Read: ఈ రోజు.. ఆ రోజే.. కోహ్లీ స్ఫూర్తిదాయక ప్రసంగం

మనం అనుకున్నవిధంగా ఫలితాలు రానప్పుడు జిమ్ కి వెళ్లాలనిపించదు, ప్రాక్టీసుకి వెళ్లాలనిపించదు.. రకరకాలుగా ఉంటుంది. కానీ అప్పుడే ఎక్కువ కష్టపడాలి, శ్రమించాలని అన్నాడు. నావరకైతే అదే అసలైన గేమ్ గా ఫీలవుతానని అన్నాడు. ఇదంతా ఆ దేవుడు పెట్టే పరీక్షగా భావించాలి. అక్కడ కుంగిపోయామా? ఇంక లేవలేమని అన్నాడు.

టీ 20 ప్రపంచకప్ 2024 లో ఓపెనర్ గా వెళ్లి అన్ని మ్యాచ్ లు విఫలమయ్యాను. కానీ ఎక్కడా గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. అందుకే అసలైన ఫైనల్ మ్యాచ్ పై ఆ ప్రభావం పడలేదని అన్నాడు. ఒక దశలో మూడేళ్లపాటు ఏ ఫార్మాట్ లోనూ విరాట్ సెంచరీ చేయలేదు. చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.

తర్వాత జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు చేశాడు. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2024లో కూడా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

ప్రస్తుతం తను లండన్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం వచ్చే నెలలో స్వదేశానికి రానున్నాడు. మరి ఇందులో ఎన్ని సెంచరీలు చేస్తాడు? తను సెంచరీల స్కోరుని ఎలా దాటిస్తాడో చూడాల్సిందే.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×