BigTV English

Zerodha CEO Nithin Kamath: బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డ జెరోదా సీఈవో.. ఆరోగ్య పరిస్థితిపై నితిన్ కామత్ ట్వీట్

Zerodha CEO Nithin Kamath: బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డ జెరోదా సీఈవో.. ఆరోగ్య పరిస్థితిపై నితిన్ కామత్ ట్వీట్

 


Zerodha CEO Nithin Kamath

Zerodha CEO Nithin Kamath Health Updates: స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ జెరోదా సీఈఓ, వ్యవస్థాపకుడు నితిన్ కామత్ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డారు. ఆయన జెరోదా సీఈఓ గానే కాదు.. ఫిట్ నెస్ తోనూ ఎంతో పాపులారిటీ సంపాదించారు. వ్యాపార రంగంలో కష్టపడి విజయం సాధించారు. అదే సమయంలోనే ఫిట్ నెస్ పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఫోలోవర్స్ ను సంపాదించారు. అనేక మంది ఆయనను సోషల్ మీడియాలో అనుకరిస్తున్నారు. అందులో యూత్ ఎక్కువ మంది ఉన్నారు. కారణం ఆయన ఫిట్ నెస్ మంత్రం.


తాను బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడినట్లు నితిన్ కామత్ స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 44 ఏళ్ల నితిన్‌ కామత్‌ ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను ఎక్స్ లో షేర్‌ చేశారు.
స్ట్రోక్ కు గురైన విషయాన్ని నమ్మలేకపోయానని తెలిపారు.

నితిన్ కామత్ సుమారు 6 వారాల క్రితం అకస్మాత్తుగా తేలికపాటి స్ట్రోక్‌తో బాధపడ్డారు. తండ్రి మరణం, నిద్రలేమి, తీవ్ర మానసిక అలసట, డీహైడ్రేషన్‌, పని ఒత్తిడి.. ఈ అంశాలన్నీ తన అనారోగ్యానికి కారణం కావొచ్చుని పేర్కొన్నారు. దీనివల్ల ముఖం వంకర తిరిగిందని తెలిపారు. చదవడం, రాయడం లాంటి పనులు చేయలేకపోయానన్నారు.

Read More: మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో

ప్రస్తుతం బ్రెయిన స్ట్రోక్ నుంచి కొంత వరకు కోలుకున్నానని నితిన్ కామత్ తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. తనకు స్ట్రోక్ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హెల్త్, ఫిటెనెస్ పై తాను ఎంతో శ్రద్ధ తీసుకునే తను ఇలా జరగడంతో నమ్మలేకపోయానన్నారు. ప్రస్తుతం ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్‌ చేయగలుగుతున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×