
Ziona Chana | 17 ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి మొదటిసారి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత తన వంశ వృక్షం విస్తారించాలని అలా పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్లాడు. చివరికి అతను 38 భార్యలను పొందాడు. వారందరినీ ఒకే ఇంట్లో పెట్టాలనే అతని ఆలోచన. అందులో కూడా సక్సెస్ సాధించాడు. వారందరితో ఒకే ఇంట్లో కాపురం పెట్టాడు. అలా అందరు భార్యతో కలిపి అతనికి 89 పిల్లలు జన్మించారు. అందరూ ఒకే చోట ఉండేందుకు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అందులో 100 గదులు నిర్మించాడు. ఆ మహానుభావుడే జియోనా చానా.
జియోనా చానా మిజోరం రాష్ట్ర రాజధాని అయిజ్వాల్‌కు సమీపంలోని బక్తావాంగ్ గ్రామంలో 1949 సంవత్సరంలో పుట్టాడు. ఆయన 17 ఏళ్ల వయసులో తొలిసారి వివాహం చేసుకున్నాడు. అతనిది చానా కులం. ఆ కులంలో పురుషులు ఒకరికంటే ఎక్కువ మహిళలను వివాహం చేసుకునే సంస్కృతి ఉంది. దీంతో జియోనా చానా కూడా మరిన్ని వివాహాలు చేసుకొని తన వంశం తన కులంలోనే అతిపెద్దదిగా ఉండాలని భావించేవాడు. తన ఆలోచనని త్వరలోనే కార్యాచరణలో పెట్టాడు. ఒకరి తరువాత ఒకటి వివాహాలు చేసుకుంటూ బిజీగా మారాడు. అలా అతను 38 సార్లు వివాహం చేసుకున్నాడు.

తన 38 భార్యలతో అతను ఒకే ఇంట్లో కాపురం పెట్టాడు. అంతమంది భార్యలతో కలిపి అతనికి 89 మంది సంతానం. ఇప్పుడు కుటుంబంలో ఎక్కువ జనాభా కావడంలో అందరికోసం తన స్వగ్రామంలోనే ఒక పెద్ద 4 అంతస్తుల భవనం నిర్మించాడు. అందులో అందరూ ఉండేందుకు 100 గదులు ఉన్నాయి.
జియోనా కుటుంబం గురించి తెలిసిన వారంతా.. ఆ గ్రామానికి ఒకసారి వచ్చి అతని కుటుంబాన్ని చూసేవారు. అలా ఆ గ్రామానికి జియోనా కుటుంబ భవనం ఒక పర్యాటక స్థానంలా మారింది. 2011లో ఒకసారి జియోనాతో ఒక మీడియా సంస్థ ఒక ఇంటర్వూ చేసింది. అందులో ఆయన మాట్లాడుతూ.. “నాకు వీలైతే మరో పెళ్లి చేసుకోవాలని ఉంది. మీకు తెలుసా నేనొకసారి.. ఒకే సంవత్సరంలో పది పెళ్లిళ్లు చేసుకున్నాను. నన్నెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేందుకు.. నా చుట్టూ 8 మంది భార్యలుంటారు. ఇంత పెద్ద కుటుంబం నాకు లభించినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పాడు

జియోనా చానా 2021లో మరణించాడు. అప్పుడతని వయసు 76 ఏళ్లు. ఆ సమయానికి అతని 14 మంది కొడుకులకు వివాహం జరిగింది. వారందరికీ కలిపి 33 పిల్లలున్నారు. వారంతా జియోనా మనవళ్లు.. మనవరాళ్లు. జియోనా చాలా ఫేమస్. అతను చనిపోయినప్పుడు మిజోరం ముఖ్యమంత్రి అతని గురించి ట్వీట్ చేశారు.
Revanth Reddy : వర్షాలపై కనీసం సమీక్ష చేయలేరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ? : రేవంత్ రెడ్డి