
KA Paul | రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎన్నికలు వస్తే అందరికీ టెన్షన్‌గా ఉంటుంది. ఆ టెన్షన్ పోగొట్టే ఒకే ఒక్క వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తన విచిత్ర వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. నవ్విస్తూ ఉంటారు. ఆయన చేసే సందడి వేరెవరూ చేయలేరనిపిస్తుంది.
తాజా కేఏ పాల్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్‌లో ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని చెప్పారు. ఆయన విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారని గురువారం ప్రకటించారు.
వైజాగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నేను విశాఖ ఎంపీగా ఎన్నికైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్ని పార్టీలు భావించడం చాలా సంతోషం. విశాఖ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ ఎంపీగా పోటీ చేయట్లేదని.. నాకు సపోర్ట్ చేయడం సంతోషం. ఇక టీడీపీ అభ్యర్థి భరత్ కూడా కేఏ.పాల్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుందని తన అనుచరులకు చెబుతున్నారు. అలాగే జేడీ లక్ష్మీ నారాయణ నన్ను విశాఖ అభ్యర్థిగా గెలిపించడానికి నా కోసం ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిగా ఊహించుకుంటున్న జీవీఎల్ అసలు పోటీ చేస్తారో? లేదో? ఆయనకే తెలీదు. అయినా ఆంధ్ర ప్రదేశ్‌కు బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతోంది, రైల్వే జోన్‌పై ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. అలాంటి బీజేపీకి ఎవరు ఓటేస్తారు? విశాఖ వాసులు సహృదయంతో అర్థం చేసుకుని పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించండి. నన్ను, ప్రజా శాంతి పార్టీనీ గెలిపించక పోతే ప్రజలకే నష్టం,” అని అన్నారు.

పాల్ చెప్పిన విషయాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు తనకే మద్దతు చేస్తున్నారని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఆయనకే తెలియాలి. ఇలా ఆయన ముందుకూడా చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తాయని సర్వేలు వెల్లడించాయని చెప్పారు.. కానీ అవి సర్వేలో ఇంతవరకూ ఎవరికీ తెలియదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ మెజారిటీ సీట్లు సంపాదించుకుంటుంది అని ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి తనకు చెప్పారని, వారు తమ ఉద్యోగాలు పోయినా పర్వాలేదని తనకు ఈ విషయాలు చెప్పారని కేఏపాల్ తెలిపారు. ఇలాంటి చమత్కారాలు పాల్ మాత్రమే చేయగలరు.

అయినా నిన్న మొన్నటి వరకు ప్రజా శాంతి పార్టీ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయబోతోందని.. కేసీఆర్, ఎన్నికల సంఘం తనను అడ్డుకోవడానికే ఎన్నికల సింబల్ కేటాయించలేదని మండిపడిన కేఏ పాల్.. అప్పుడే ఆంధ్ర రాజకీయాలలో బిజీ అయిపోయారు. తెలంగాణ కాకపోతే ఏమైంది ఏపీ ఉందిగా అని భావించినట్లుగా ఉన్నారు.
అందుకే వైజాగ్ ఎంపీగా తాను మాత్రమే కరెక్ట్.. పర్ఫెక్ట్ అని అనుకున్నారేమో.. వెంటనే రంగంలోకి దిగారు.
Pawan Kalyan: మిస్టర్ జగన్మోహన్‌రెడ్డి.. నీ చిట్టా విప్పితే చెవుల నుంచి రక్తం కారుతుంది..