BigTV English

Mizoram Election Results : మిజోరంలో ZPM విజయం.. ఎన్నికల్లో ఓడిన సిఎం, డిప్యూటీ సీఎం

Mizoram Election Results : భారత దేశంలో ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన మిజో నేషనల్ ఫ్రంట్‌ (MNF)కు గట్టి షాక్‌ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రి జోరంతంగాతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు.

Mizoram Election Results : మిజోరంలో ZPM విజయం.. ఎన్నికల్లో ఓడిన సిఎం, డిప్యూటీ సీఎం

Mizoram Election Results : భారత దేశంలో ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన మిజో నేషనల్ ఫ్రంట్‌ (MNF)కు గట్టి షాక్‌ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రి జోరంతంగాతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. మొత్తం 40 సీట్లున్న మిజోరం అసెంబ్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 21 సాధించాలి.


అయితే ప్రతిపక్ష కూటమి జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM)కి ఇప్పటికే స్పష్టమైన మెజార్టీ లభించింది. 40 అసెంబ్లీ స్థానాలకు గాను 21 స్థానాల్లో ZPM విజయం సాధించింది. మరో 6 స్థానాల్లో ఆధికయంలో ఉంది. అధికార MNF పార్టీకి ఇప్పటికి 6 సీట్లు గెలిచి.. మరో 4 చోట్ల ముందంజలో ఉంది. బిజేపీ రెండు స్థానాల్లో, కాంగ్రెస్ ఒక సీటుపై ఆధిక్యంలో ఉన్నారు.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోరతంగా 2100 ఓట్లతో ఓడిపోయారు. ఉపముఖ్యమంత్రి తుయ్‌చాంగ్ 909 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోవైపు ZPM ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్ దుహోమా సెర్చిప్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బిజేపీ గత ఎన్నికల్లో ఒక సీటు పరిమితమవగా.. ఈసారి రెండు సీట్లు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ గత ఎన్నికల్లో అయిదు సీట్లు గెలుచుకోగా.. ఈసారి కేవలం ఒకసీటుకే పరిమితమైంది.


MNF పార్టీ గతంలో బిజేపీతో పొత్తు పెట్టుకుంది. మరి ఈ సారి గెలిచిన ZPM జాతీయ స్థాయిలో ఎవరికి మద్దతుగా ఉంటుందో చూడాలి.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×