E-Paper
Advertisement

2024 Best Telugu Web Series List on OTT : ఈ ఏడాది ఓటిటీ లో దుమ్ము రేపిన తెలుగు వెబ్ సిరీస్ లు ఇవే

2024 Best Telugu Web Series List on OTT : ఈ ఏడాది ఓటిటీ లో దుమ్ము రేపిన తెలుగు వెబ్ సిరీస్ లు ఇవే
Advertisement

2024 Best Telugu Web Series List on OTT :  వెబ్ సిరీస్ లు థియేటర్ తో పని లేకుండా డైరెక్ట్ గా ఓటీటీ  ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి. మంచి కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ ఏడాది తెలుగు వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేశాయి. 2024 లో ప్రేక్షకులను అలరించిన టాప్ వెబ్ సిరీస్ లు ఏమిటో చూసేద్దాం పదండి.

సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (Save the tigers season 2)

Advertisement

సేవ్ ది టైగర్స్ మొదటి సీజన్ సూపర్ హిట్ అవడంతో, రెండవ సిరీస్ ఈ ఏడాదిలో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన అన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరించాయి. ప్రియదర్శి, చైతన్య, అభినవ గోమటం ప్రధాన పాత్రల్లో నటించారు. మిడిల్ క్లాస్ కామెడీ డ్రామా తో ఈ సిరీస్ తెరకెక్కింది. ముగ్గురు స్నేహితులు తమ జీవితాల్లో జరిగే సంఘటనలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. ఇప్పటివరకు ఈ సిరీస్ చూడకంటే ఈ వీకెండ్ ఒకసారి చూసేయండి. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disny +hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

పరువు (paruvu)

Advertisement

2024లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ బెస్ట్ సిరీస్ లో ఇది కూడా ఒకటి. నరేష్ అగస్త్య, నివేదా హేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమించుకున్న ఒక జంట కులాలు వేరు కావడంతో, పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఈ జంట ఊరి పెద్దలను ఎలా ఎదుర్కొంటారు అనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ5  (Zee5) లో స్ట్రీమింగ్ అవుతుంది.

90,s

సినీ నటుడు శివాజీ ఈ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ఏడాది వచ్చిన వెబ్ సిరీస్ లో ఈ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. శివాజీ తన పిల్లలను చదివిస్తూ, మిడిల్ క్లాస్ లైఫ్ని చూపిస్తూ బాగా ఎంటర్టైన్ చేశాడు. ఈ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. 2024 లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లో ఇది కూడా ఒకటి. ఈ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (ETV Vin) లో స్ట్రీమింగ్ అవుతోంది.

వికటకవి (Vikatakavi)

నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన  ఈ వెబ్ సిరీస్ 1970 దశకంలో సాగుతుంది. ఒక ఊరిలో జరిగే కొన్ని విచిత్రమైన సంఘటన ఎదుర్కొనే ఒక డిటెక్టివ్, చివరికి ఆ ఊరిలో రహస్యాలను బయటపెడతాడా అనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ 5 (Zee5)  స్ట్రీమింగ్ అవుతుంది.

అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (Arthamainda Arun Kumar Season 2)

ఈ కామెడీ వెబ్ సిరీస్ కు జోనాధన్ ఎడ్వర్డ్ దర్శకత్వ వహించాడు. 2023లో మొదటి సిరీస్ విజయవంతంగా ప్రదర్శితమైంది. రెండవ సీజన్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఐటి ఉద్యోగం చేసుకునే అరుణ్ కుమార్, సిటీలో ఎదుర్కొనే సమస్యలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ కామెడీ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×