OTT Movie : హర్రర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా మూవీ లవర్స్ ఉత్సాహం చూపిస్తారు. ఈ సినిమాలలో వచ్చే విజువల్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కొన్ని సినిమాలు ఒంటరిగా చూడాలంటే ఇక అంతే సంగతులు. ఇటువంటి మూవీలను రాత్రిపూట చూస్తే పైప్రాణాలు పైకెళ్ళిపోతాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు 1408. ఈ మూవీలో హీరో దయ్యాల కథలను రాస్తూ ఉంటాడు. ఇతనికి దయ్యాల మీద పెద్దగా నమ్మకం ఉండదు. దయ్యాలపై ఉండే నమ్మకాలను కొట్టి పడేస్తాడు. అయితే 1408 రూమ్ నెంబర్ లోకి వెళ్లినాక ఇతని అంచనాలు మారుతాయి. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మైక్ హర్రర్ స్టోరీస్ రాస్తూ ఉంటాడు. మైక్ పారా నార్మల్ యాక్టివిటీస్ మీద రీసెర్చ్ చేస్తూ, స్టోరీలు రాసి పబ్లిష్ చేస్తుంటాడు. అయితే మైక్ దయ్యాలు లేవని నమ్ముతాడు. ఎక్కడైనా దయ్యాలు ఉన్నాయని ఎవరన్నా నమ్ముతుంటే, అక్కడికి వెళ్లి వాటి మీద స్టోరీ రాస్తూ ఉంటాడు. ఒకసారి దయ్యాలు ఉన్నాయని రూమర్ ఒకటి వస్తుంది. ఆ రూమర్ వచ్చిన హోటల్ కి మైక్ వెళ్తాడు. మైక్ కి వాళ్లు అందులో దయ్యం ఉందని చెప్తారు. అక్కడే స్టోరీ రాయాలి అనుకొని ఆ హోటల్ కి వెళ్తాడు. అయితే అందులో దయ్యం ఏమాత్రం ఉండదు. మైక్ కి బోర్ కొట్టి బయటికి వెళ్లిపోతాడు. ఒకచోట తన బుక్ ను పబ్లిష్ చేస్తూ, ఒక మెసేజ్ చూస్తాడు. ఒక హోటల్లో 1408 నెంబర్ గల రూమ్ లో స్టే చేయకూడదు అని రాసి ఉంటుంది. మైక్ ఆ హోటల్ కి వెళ్లి 1408 రూమ్ నెంబర్ కావాలని అడుగుతారు. ఆ నెంబర్ కావాలంటే మేనేజర్ ని సంప్రదించాలని హోటల్ స్టాఫ్ చెప్తారు. మేనేజర్ ని సంప్రదించాక, ఆ రూమ్ కి వెళ్లిన వాళ్లు ఒక గంట కన్నా ఎక్కువగా బతకరు అని బదులు చెప్తాడు.
నువ్వు చనిపోతే ఒక గంట తర్వాత ఆ రూమ్ ని ఎవరికి ఇవ్వాలని అడుగుతారు. మైక్ నాకు 1408 రూమ్ కావాలని అడిగి తీసుకుంటాడు. అందులోకి వెళ్ళాక కాసేపటికి అంతా మామూలుగానే ఉంటుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. అతనికి ఆ రూమ్లో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. గోడకు పగుళ్లు రావడం, దయ్యాలు అతని మీద అటాక్ చేయడం. చనిపోయిన తన మనుషులు మళ్లీ బ్రతికి రావడం, ఇలా అన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మైక్ ఆత్మహత్య చేసుకునేలాగా ఆ దయ్యం ప్రేరేపిస్తూ ఉంటుంది. మైక్ ని బయటకు వెళ్ళనీయకుండా ఆ దయ్యం కవర్ చేస్తుంది. చివరికి మైక్ ఆ రూమ్ నుంచి బయట పడగలుగుతాడా? దయ్యాలు మైక్ ని చంపేస్తాయా? మైక్ ఆత్మహత్య చేసుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే 1408 మూవీని తప్పకుండా చూడండి.