Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే పేరు అనుకుంటివా.. బ్రాండ్ అని ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప 2 తో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసాడు. కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ ను క్రాష్ చేసి సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసాడు. వారం రోజులు అయిన పుష్ప రాజ్ కలెక్షన్స్ తగ్గలేదు ఇప్పుడు వీకెండ్ కావడంతో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్ చేసినందుకు సినీ, రాజకీయ ప్రముఖులకు, అభిమానులకు అల్లు అర్జున్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.. ఇక ఈ క్రమంలో బన్నీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గత కొద్ది రోజులుగా బన్నీ పొలిటిషియన్స్ ను కలవడం తో ఆ వార్తలు నిజమేనని వినిపిస్తుంది. ఒకవేళ ఎంట్రీ ఇస్తే పార్టీ పేరు ఏమి పెడతాడు అనే చర్చలు నెట్టింట వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు రావడానికి కారణం కూడా ఉందనే చెప్పాలి.. ఇటీవల ఆయన వరుస పొలిటిషియన్స్ ను మీట్ అవుతున్నారు. ఆ మధ్య ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యాడట. ఈ భేటీ లో అల్లు అర్జున్ తో పాటు బన్నీ వాసు, అదే విధంగా ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా పాల్గొన్నాడట. భవిష్యత్తులో అల్లు అర్జున్ కి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందని, అందుకోసమే ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసాడని ఇలా పలు రకాల చర్చలు సోషల్ మీడియా లో చోటు చేసుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్ కి పదేళ్ల పాటు సేవ కార్యక్రమాలు చెయ్యమని, ఆ తర్వాతనే రాజకీయ రంగ ప్రవేశం చెయ్యమని సలహా ఇచ్చాడట. అందుకే బన్నీ చిరంజీవికి పోటీగా బ్లడ్ బ్యాంక్ ను ఓపెన్ చెయ్యనున్నారని, అలాగే పలు సేవలను అందించాలని అనుకున్నట్లు వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తలకు అల్లు అర్జున్ టీం వెంటనే స్పందించింది. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అభిమానుల్లో గందరగోళం సృష్టించడానికి కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరించింది.. కానీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. అటు ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.. ఫ్యాన్స్ కోరికను తీరుస్తానని పుష్ప 2 ప్రమోషన్స్ లో చెప్పాడు. పొలిటికల్ లీడర్ గా ఫ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారు. మరి వాళ్ళ కోరిక మేరకు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే మాత్రం ఇక రాజకీయాల్లో కూడా మెగా vs అల్లు వార్ మొదలైనట్లే.. ఇదంతా పక్కనపెడితే అల్లు అర్జున్ ఏ పార్టీతో సంబంధం లేకుండా కొత్త పార్టీ పెడితే మాత్రం ఆర్మీ అనే పేరుతో పార్టీని పెట్టనున్నారని ఓ వార్త వినిపిస్తుంది.. మరి ఈ వార్తల పై అల్లు అర్జున్ స్పందించి ఫ్యాన్స్ కోరికను తీరుస్తారేమో చూడాలి.. ఇక సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యనున్నాడు… త్వరలోనే ఈ మూవీ అప్డేట్ రాబోతుంది..