E-Paper
Advertisement

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి 4 మోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలు… ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి 4 మోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలు… ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : ఓటీటీలో ఈ రోజు సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చాయి. థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమాలు, ఓటీటీలో అంతకు మించి ఆదరణను పొందుతున్నాయి. రష్మిక మందన్న నటించిన ‘గర్ల్‌ఫ్రెండ్’ నుంచి ప్రణవ్ మోహన్ లాల్ ‘డైస్ ఇరాయే’ థ్రిల్లర్ లతో ఆడియన్స్ కి ఈ వీక్ ఎంటరైనమెంట్ షురూ అయిపోయింది. ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయి ? వీటి వివరాలేంటి అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

‘గర్ల్‌ఫ్రెండ్’

రష్మిక మందన్న, ధీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది. అను ఇమ్మాన్యుయేల్, రాహుల్ రవీంద్రన్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. 2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా
2025 డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ తండ్రి పెంపకంలో పెరిగిన భూమ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి హైదరాబాద్‌లోని ఒక కాలేజ్ లో చేరుతుంది. అక్కడ ఆమె విక్రమ్‌ అనే విద్యార్థితో కలుస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే త్వరలోనే విక్రమ్ సైకోలా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. దీంతో వీళ్ళ సంబంధం ప్రశ్నార్థకంగా మారుతుంది. చివరికి వీళ్ళు కలిశారా ? లేదా విడిపోతారా ? అనేదే ఈ కథ

2. ‘డైస్ ఇరాయే’

ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రణవ్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించగా, సుస్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, అరుణ్ అజికుమార్, శ్రీధన్య, మదన్ బాబు కె, సుధా సుకుమారి, షైన్ టామ్ చాకో ముఖ్య పాత్రల్లో నటించారు. 1 గంట 53 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2025 డిసెంబర్ 5 నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేరళలోని ఒక విలాసవంతమైన జీవితం గడుపుతున్న రోహన్ అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను ఒకప్పుడు ప్రేమలో ఉన్న కని అనే అమ్మాయి మరణించినప్పుడు అతని జీవితం తలకిందులు అవుతుంది. ఆమె అంత్యక్రియల సమయంలో, రోహన్ ఇంటికి తిరిగి వెళ్ళే ముందు రహస్యంగా ఆమె జుట్టు క్లిప్‌ను జ్ఞాపకార్థం తీసుకుంటాడు. అయితే త్వరలోనే కని ఆత్మ అతన్ని వెంటాడటం ప్రారంభిస్తుంది. భయపడిన రోహన్, ఒక క్షుద్ర మాంత్రికుడి సాయం తీసుకుంటాడు. తరువాత అతను ఆ ఆత్మ నుండి బయటపడ్డాడా లేదా అనేది మిగిలిన కథ.

3. ‘స్టీఫెన్’

గోమతి శంకర్, మైఖేల్ తంగదురై, స్మ్రుతి వెంకట్ నటించిన ఈ తమిళ సినిమా మిథున్ బాలాజీ దర్శకత్వంలో రూపొందింది.
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా దాదాపు 2 గంటల నిడివితో 2025 డిసెంబర్ 5 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
తొమ్మిది మంది అమ్మాయిలను చంపానని పోలీసులకు లోగిపోయిన ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతన్ని విచారిస్తున్న ఒక మానసిక వైద్యుడికి ఎన్నో అనుమాలు వస్తాయి. కిల్లర్ నిజం చెప్తున్నాడా ? లేదా కావాలనే ఇందులో ఇరుక్కుంటున్నాడా ? అనే సందేహాలు మొదలవుతాయి.

4. ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’

తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, ప్రభావతి, మాధవి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ తెలుగు సినిమాకి రాహుల్ శ్రీనివాస్ లుకలపు దర్శకత్వంలో తెరకెక్కింది. 1 గంట 56 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2025 డిసెంబర్ 5 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ ఒక చిన్న పట్టణంలోని రమేష్ అనే ఫోటోగ్రాఫర్ ని అనుసరిస్తుంది. ఆ ఊరి రాజకీయ నాయకుడి ప్రీ-వెడ్డింగ్ షూట్ ఫోటోలను కలిగి ఉన్న మెమరీ కార్డ్‌ను అతను పోగొట్టుకుంటాడు. ఆతరువాత స్టోరీ ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుంది. చివరికి అతను దీని నుంచి ఎలా బయట పడ్డాడనేదే ఈ కథ.

 

Read Also : పాడు చేసినోడిని పాడెక్కించే అమ్మాయి…. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×