E-Paper
Advertisement

OTT Movie : క్లూస్ లేకుండా వరుస హత్యలు … ఇన్వెస్టిగేషన్ లో ఊహించని ట్విస్టులు …

OTT Movie : క్లూస్ లేకుండా వరుస హత్యలు … ఇన్వెస్టిగేషన్ లో ఊహించని ట్విస్టులు …
Advertisement

OTT Movie : ఒక ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, తెలివైన పోలీసు అధికారిగా శివ (నవీన్ చంద్ర)కి పేరు ఉంటుంది. తన అసాధారణ ఇన్వెస్టిగేషన్ నైపుణ్యాలతో అనేక క్రిమినల్ కేసులను పరిష్కరించాడు. కానీ ఇప్పుడు అతనికి ఒక కొత్త సీరియల్ కిల్లింగ్ కేసుతో ఒక సవాల్ ఎదురవుతుంది. ఇది అతని కెరీర్‌లో అత్యంత భిన్నమైనది. ఈ కేసులో ఊహించని ట్విస్ట్‌లు కూడా ఉంటాయి. ఒక మాస్టర్‌మైండ్ కిల్లర్‌తో శివ ఎలా పోరాడతాడు? అతను ఈ కిల్లర్‌ను పట్టుకోగలడా ? ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ సినిమా స్టోరీ శివ (నవీన్ చంద్ర) అనే పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. అతను తన నిజాయితీ, తెలివితేటలతో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో గొప్ప ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాడు. అతని జీవితం సాధారణంగా సాగుతున్నప్పుడు, ఒక సీరియల్ కిల్లింగ్ కేసు అతనికి అప్పగిస్తారు. ఈ కేసు అతని మునుపటి కేసుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కిల్లర్ అత్యంత తెలివిగా, జాగ్రత్తగా ప్లాన్ చేసి హత్యలు చేస్తుంటాడు. ఎటువంటి క్లూలు మిగల్చకుండా, తప్పించుకుని తిరుగుతుంటాడు. శివ తన సహాయకురాలు అను (రేయా హరి)తో కలిసి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు.

కథ మొదటి సగంలో కొంత ప్రిడిక్టబుల్‌గా అనిపించినప్పటికీ, రెండవ సగంలో ఊహించని ట్విస్ట్‌లు, సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శివ కేసును లోతుగా వెళ్ళే కొద్దీ, కిల్లర్ మోటివ్‌లు, గతంతో అతని జీవితం, కేసు వెనుక దాగి ఉన్న రహస్యాలు బయటపడతాయి. ఈ క్రమంలో శివ తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర నటన, డి. ఇమ్మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. చివరికి ఈ సీరియల్ కిల్లర్ ఎవరు ? ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు ? శివ యొక్క గతంతో కేసుకు ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : అడవిలో ఒంటరి జంటని ఆవహించే దెయ్యం … ఓటీటీలో టాప్ లేపుతున్న హారర్ థ్రిల్లర్

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లెవెన్’ (Eleven). 2025లో విడుదలైన ఈ సినిమాకి లోకేష్ అజ్ల్స్ రాసి దర్శకత్వం వహించారు. ఇది తమిళం, తెలుగు భాషలలో బైలింగువల్‌గా విడుదలైంది. నవీన్ చంద్ర, రేయా హరి ప్రధాన పాత్రల్లో నటించారు. డి. ఇమ్మాన్ దీనికి సంగీతం అందించారు. ఈ మూవీ 2025 మే 16న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

పెళ్లి, ప్రేమంటేనే గిట్టదు.. ఏకంగా ఆ బొమ్మల కంపెనీ ఓనర్‌తోనే… కరెంట్ ట్రెండింగ్ కొరియన్‌ సిరీస్‌ తెలుగులో

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

Big Stories

Advertisement
×