BigTV English
Advertisement

OTT Movie : సమాధి కోసం సాహస యాత్ర … శాపం కోసం పడరాని పాట్లు … అదిరిపోయే అడ్వెంచర్ మూవీ

OTT Movie : సమాధి కోసం సాహస యాత్ర … శాపం కోసం పడరాని పాట్లు … అదిరిపోయే అడ్వెంచర్ మూవీ

OTT Movie : చైనాలోని ఒక శాపగ్రస్తమైన అడవిలో, ముగ్గురు వ్యక్తులు హు బాయి, వాంగ్ కైక్సువాన్, షిర్లీ యాంగ్ ఒక సాహస యాత్ర మొదలుపెడతారు. ఒక పురాతన శాపం నుండి తప్పించుకోవడానికి ‘కింగ్ షియాన్’ సమాధిని వెతుకుతారు. వారి లక్ష్యం ‘హావోచెన్ బీడ్’ అనే పురాతన వస్తువును స్వాధీనం చేసుకోవడం. ఇది వీళ్ళకు పట్టిన శాపాన్ని తొలగించగలదు. కానీ ఈ సమాధి చుట్టుపక్కల ఎన్నో ఉచ్చులు ఉంటాయి. వీళ్ళు సమాధి దగ్గరకి వెళ్లగలరా ? ఈ శాపం నుండి బయటపడగలరా ? లేక కింగ్ షియాన్ సమాధి వారిని కూడా అంతం చేస్తుందా ? ఈ సినిమా వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి ?


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ యున్నాన్ ప్రావిన్స్‌లోని ఒక వార్మ్ వ్యాలీలో ప్రారంభమవుతుంది. అక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు శాపాన్ని తొలగించడానికి కింగ్ షియాన్ సమాధిని కనిపెట్టడానికి ప్రయాణం మొదలుపెడతారు. అయితే  సమాధి వైపు వెళ్లే మార్గం పురాతన ఆలయాలు, రహస్య గదులు, డెడ్‌ట్రాప్‌లతో నిండి ఉంటుంది. వీళ్ళు పురాతన యంత్రాలు, రాకాసి కీటకాలు, దెయ్యాలతో కూడా పోరాడాలి. హు బాయి సైనిక నైపుణ్యాలు, షిర్లీ యాంగ్ పురావస్తు పరిజ్ఞానం వీళ్లను ముందుకు నడిపిస్తాయి.


ఈ సినిమా ఒక ఫాస్ట్-పేస్డ్ అడ్వెంచర్.  ఇందులో టోంబ్ రైడింగ్ థీమ్‌లు ఉంటాయి. ఈ స్టోరీ ‘Indiana Jones’ ‘The Mummy’ వనరీ సినిమాలను గుర్తు చేస్తుంది. . CGI ఎఫెక్ట్స్, రాకాసి కీటకాల సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హావోచెన్ బీడ్ నిజంగా ఈ శాపాన్ని తొలగిస్తుందా ? లేక దాని వెనుక మరో రహస్యం దాగి ఉందా? కింగ్ షియాన్ సమాధిలోని భయంకరమైన ఉచ్చులు ఎవరు సెట్ చేశారు? అనే ఈ ప్రశ్నలకు సమాధానాలను, ఈ  మూవీని చూసి తెలుసుకోవాలసిందే.

Read Also : విమానంపై పిడుగు… గాల్లో అలజడి… ఈ ఓటీటీ మూవీ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే

ఈ యాక్షన్-అడ్వెంచర్-థ్రిల్లర్ సినిమా పేరు “King Xian’s Worm Valley of Ghost Blowing Lamp” 2023 లో విడుదలైన ఈ సినిమాకి యిలిన్ డై దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జాంగ్ ము యే రాసిన “Candle in the Tomb” నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో యుమింగ్ పాన్, విన్సెంట్ జాంగ్, హు, లికున్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక పురాతన శాపం చుట్టూ తిరుగుతుంది. వీరు ఒక పురాతన శాపం, “మిస్ట్ కర్స్,”తో సంక్రమించబడ్డారు, దీనిని తొలగించడానికి వారు కింగ్ షియాన్ యొక్క సమాధిలో ఉన్న హావోచెన్ బీడ్‌ను స్వాధీనం చేసుకోవాలి. Jio Hotstarలో 2025 మార్చి 15 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Big Stories

×